Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

మోదీ ఆదేశాలతో… జిన్ పింగ్ విందు కోసం పసందైన వంటకాలు

మహాబలిపురం పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కోసం ప్రధాని మోదీ ప్రత్యేక విందునిచ్చారు. తాజ్ ఫిషర్మెన్స్ కోవ్ రిసార్ట్ అండ్ స్పా లో జరిగిన ఈ విందులో దక్షిణాది వంటకాలతో బాటు చైనీ డిష్ లు కూడా వడ్డించారు. ఈ డిన్నర్ లో వడ్డించాల్సిన వంటకాలను మోదీ స్వయంగా ఎంపిక చేశారట. తమిళనాడు సంప్రదాయ వంటకాలైన ఇడ్లీ, దోసె, ఇడియాప్పం, ‘ అరచ్ఛు చిట్ట సాంబార్ ‘, వడ కర్రీ, కడలై కుర్మా, టమాటో రసం, పనీర్ ఘోస్ట్, బియ్యపు హల్వా, మలబార్ లాబ్ స్టర్, చెట్టినాడు రుచులతో కూడిన మాంసాహార, శాకాహార డిష్ లు వీటిలో ఉన్నాయి. వీటితో బాటు చెనీస్ వంటకాలైన షాంగై నూడిల్స్, మటన్ ఫ్రై, మసాలా చికెన్ టిక్కా… ఇంకా టీ, స్వీట్లు ఉన్నాయి. చైనా నుంచి ప్రత్యేకంగా కుక్ లను రప్పించారు. దాదాపు 70 మందికి పైగా వంటవారు విందుకు హాజరైన సుమారు మూడు వందల మందికి అనేక రకాల వంటకాలను రుచిగా వడ్డించారు.
ఇదిలా ఉండగా.. మహాబలిపురం సముద్ర తీర ఆలయం వద్ద నిర్వహించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలను మోదీ-జీ జిన్ పింగ్ వీక్షించారు. చెన్నై కి చెందిన కళాక్షేత్ర విద్యార్థులు ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ తో బాటు కథాకళి నృత్యాలు, భరతనాట్యాలు, కర్ణాటక శాస్త్రీయ సంగీతం వీనుల విందుగాను, ..కనువిందుగాను సాగాయి.