మంగళగిరి గెలుపుపై లోకేశ్ ధీమా!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళగిరి నుంచి పోటీలో ఉన్న మంత్రి నారా లోకేశ్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఆదివారం నుంచి నారా బ్రాహ్మణి బరిలోకి దిగారు. ఏలాగైనా ఈ నియోజవర్గంలో పచ్చ జెండా ఎగురవేసి, 30 ఏళ్ల చరిత్రను మార్చాలని టీడీపీ భావిస్తోంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి సైతం ఈసారి కూడా గెలుపు తనదేనని ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉండగా, తాడేపల్లిలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం […]

మంగళగిరి గెలుపుపై లోకేశ్ ధీమా!
Follow us

| Edited By:

Updated on: Apr 08, 2019 | 3:20 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళగిరి నుంచి పోటీలో ఉన్న మంత్రి నారా లోకేశ్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఆదివారం నుంచి నారా బ్రాహ్మణి బరిలోకి దిగారు. ఏలాగైనా ఈ నియోజవర్గంలో పచ్చ జెండా ఎగురవేసి, 30 ఏళ్ల చరిత్రను మార్చాలని టీడీపీ భావిస్తోంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి సైతం ఈసారి కూడా గెలుపు తనదేనని ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉండగా, తాడేపల్లిలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించిన నారా లోకేశ్ మాట్లాడుతూ… 1985 తరువాత మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరలేదని, ఈసారి ఇక్కడ గెలిచి 30 ఏళ్ల చరిత్రను తిరగరాస్తామని వ్యాఖ్యానించారు.

వచ్చే ఐదేళ్లలో ప్రజల కోసం కొత్త పథకాలను ప్రవేశపెడతామని, మరో మూడుసార్లు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద నగదు ఇచ్చే బాధ్యత చంద్రన్న తీసుకుంటారని లోకేశ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ మేనిఫెస్టోలోని అంశాలపై లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఎక్కడా రాజధాని అమరావతి పేరు ప్రస్తావించలేదంటే వారి ఆలోచన ఒక్కటేనని, రాజధానిని వేరే జిల్లాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని లోకేశ్‌ హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ, ఇందులో భాగంగానే ఎన్నికల సమయంలో ఏ రాష్ట్రంలో చేయని బదిలీలు ఏపీలో చేస్తున్నారని ఆరోపించారు.