భార్యతో గొడవపడి విమానం హైజాక్ చేయబోయాడు

ఢాకా: బంగ్లాదేశ్‌లో విమానాన్ని హైజాక్‌ చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని ఆ దేశ భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. హైజాకర్‌పై కాల్పులు జరిపి ప్రయాణికులను రక్షించారు. అయితే ఈ ఘటన వెనుక ఎలాంటి ఉగ్రకోణం లేదని, కేవలం వ్యక్తిగత కారణాలతోనే నిందితుడు విమానాన్ని హైజాక్‌ చేసేందుకు యత్నించినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు.భార్యతోమనస్పర్థల కారణంగానే సదరు వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. 148 మంది ప్రయాణికులతో ఢాకా నుంచి దుబాయ్‌ వెళ్తున్న బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్‌ విమానాన్ని మార్గమధ్యంలో దారి మళ్లించేందుకు […]

భార్యతో గొడవపడి విమానం హైజాక్ చేయబోయాడు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:47 PM

ఢాకా: బంగ్లాదేశ్‌లో విమానాన్ని హైజాక్‌ చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని ఆ దేశ భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. హైజాకర్‌పై కాల్పులు జరిపి ప్రయాణికులను రక్షించారు. అయితే ఈ ఘటన వెనుక ఎలాంటి ఉగ్రకోణం లేదని, కేవలం వ్యక్తిగత కారణాలతోనే నిందితుడు విమానాన్ని హైజాక్‌ చేసేందుకు యత్నించినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు.భార్యతోమనస్పర్థల కారణంగానే సదరు వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.

148 మంది ప్రయాణికులతో ఢాకా నుంచి దుబాయ్‌ వెళ్తున్న బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్‌ విమానాన్ని మార్గమధ్యంలో దారి మళ్లించేందుకు నిందితుడు యత్నించాడు. ఛత్రోగ్రామ్‌ విమానాశ్రయం నుంచి విమానం బయల్దేరిన కాసేపటికే ప్రయాణికుల్లోని ఓ వ్యక్తి తన వద్ద పిస్తోలు, పేలుడు పదార్థాలు ఉన్నాయని బెదిరిస్తూ కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. తనకు భార్యతో గొడవలున్నాయని, ఈ విషయమై బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో వెంటనే మాట్లాడాలని నిందితుడు పదేపదే డిమాండ్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

దీంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని ఛత్రోగ్రామ్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించేశారు. అక్కడ హైజాకర్‌తో ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ప్రయాణికులను విమానం నుంచి దింపేయాలని అడగగా అందుకు హైజాకర్‌ ఒప్పుకున్నాడు. దీంతో వారిని అత్యవసర ద్వారం గుండా బయటకు తీసుకొచ్చారు. అనంతరం కమాండోలు రంగ ప్రవేశం చేసి లొంగిపోవాలని హైజాకర్‌ను హెచ్చరించారు. అతడు నిరాకరించడంతో కాల్పలు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హైజాకర్ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడిని బంగ్లాదేశ్‌కు చెందిన మహదిగా గుర్తించారు. అయితే అతడి గన్ ఎలా వచ్చింది.. వాటిని విమానంలోకి ఎలా తీసుకొచ్చాడన్నది మాత్రం తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడు మానసిక స్థితి సరిగ్గా లేదని చర్చల సమయంలో తాము గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!