క‌రెంట్ బిల్లు చూసి ఆత్మహత్య.. ఇంతకీ బిల్లు ఎంతంటే..?

మ‌హారాష్ట్ర‌లోని నాగ‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. మూడు నెల‌ల కాలానికి ఓ ఇంటికి వ‌చ్చిన క‌రెంట్ బిల్లు వంద‌ల్లో కాదు.. వేల‌ల్లో వ‌చ్చింది. ఈ బిల్లును షాక్ తిన్న ఇంటి య‌జ‌మాని చేసేదేమీ లేక నిప్పంటించుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. నాగ‌పూర్‌కు చెందిన లీలాధ‌ర్

క‌రెంట్ బిల్లు చూసి ఆత్మహత్య.. ఇంతకీ బిల్లు ఎంతంటే..?
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2020 | 5:44 PM

మ‌హారాష్ట్ర‌లోని నాగ‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. మూడు నెల‌ల కాలానికి ఓ ఇంటికి వ‌చ్చిన క‌రెంట్ బిల్లు వంద‌ల్లో కాదు.. వేల‌ల్లో వ‌చ్చింది. ఈ బిల్లును చూసి షాక్ తిన్న ఇంటి య‌జ‌మాని చేసేదేమీ లేక నిప్పంటించుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. నాగ‌పూర్‌కు చెందిన లీలాధ‌ర్ ల‌క్ష్మ‌ణ్ గైధానీ(57) ఇంటికి మూడు నెల‌ల లాక్‌డౌన్ కాలంలో రూ. 40 వేల క‌రెంట్ బిల్లు వ‌చ్చింది. ఈ బిల్లును చూసి ల‌క్ష్మ‌ణ్ షాక్ అయ్యాడు. బిల్లు భారీ మొత్తంలో రావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించాడు.

కానీ, లీలాధ‌ర్ కు అధికారుల నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు. అధికారుల తీరుకు విసిగిపోయిన బాధితుడు.. మ‌ద్యం మ‌త్తులో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ల‌క్ష్మ‌ణ్ మృతి ప‌ట్ల ఎంఎన్ఎస్ పార్టీ సంతాపం తెలిపింది. ఎంఎన్ఎస్ పార్టీ నాయ‌కుడు రాజ్ థాక‌రే.. క‌రెంట్ బిల్లుల్లో త‌ప్పులు దొర్ల‌కుండా, పెంచిన బిల్లుల‌ను త‌గ్గించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. ఫిర్యాదులు ప‌రిష్కారం కాకముందే విద్యుత్ క‌నెక్ష‌న్లు తొల‌గించొద్ద‌ని మ‌హారాష్ట్ర విద్యుత్ బోర్డు త‌మ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది.

Read More:

గుడ్ న్యూస్: తెలంగాణ ఆస్పత్రుల్లో ఇక ఆర్‌టీ-పీసీఆర్‌ ద్వారా కరోనా టెస్ట్..!

తెలంగాణలో కొలువుల జాతర.. కార్మిక ఉపాధి కల్పన శాఖ కొత్త ప్లాన్‌..!