ఏపీలో రైతులకు ఉచిత బోర్‌ వెల్స్‌‌.. అర్హతలివే

సన్న, చిన్న కారు రైతులను ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం 'వైఎస్సార్‌ రైతు భరోసా' అనే పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఏపీలో రైతులకు ఉచిత బోర్‌ వెల్స్‌‌.. అర్హతలివే
Follow us

| Edited By:

Updated on: Jul 04, 2020 | 10:02 AM

సన్న, చిన్న కారు రైతులను ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ అనే పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని అమలుకు సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ పథకంలో భాగంగా సన్న, చిన్న కారు రైతులకు ఉచిత బోర్‌వెల్స్ కార్యక్రమం అమలు చేయబోతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది.

ఈ క్రమంలో బోరు డ్రిల్లింగ్‌ కార్యకలాపాలు చేపట్టే ముందు సంబంధిత రైతు పొలంలో హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్‌ సర్వే నిర్వహిస్తారు. ఆ తరువాతే బోరు బావుల నిర్మాణ ప్రక్రియ మొదలు కానుంది. అయితే భూగర్భ జల మట్టం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గుర్తించిన 1,094 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకాన్ని అమలు చేయబోరు.

బోర్‌వెల్స్‌కు అర్హతలు, విధివిధానాలు:  1. రైతుకు కనిష్టంగా 2.5 ఎకరాలు, గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండాలి. ఒకవేళ లేకపోతే పక్కనున్న రైతులతో కలిసి గ్రూపుగా ఏర్పడొచ్చు. అంతేకాదు ఆ భూమిలో అంతకు ముందు ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు.

2. ఈ అర్హతలు కలిగిన లబ్ధిదారుడు పట్టాదార్‌ పాస్‌ బుక్, ఆధార్‌ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా నేరుగా ఆన్‌లైన్‌లో బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

3. ఆ తరువాత దీనికి సంబంధించి పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారు. ఆ తరువాతే  తదుపరి అనుమతికి ఎంపీడీవోకు ఆ దరఖాస్తు వెళుతుంది.

4. జిల్లా మొత్తంలో ఎంపిక చేసిన రైతుల జాబితాలను డ్వామా పీడీలకు ఎంపీడీవోలు అందజేయనున్నారు.

5. బోరు బావి మంజూరు సమాచారాన్ని గ్రామ సచివాలయం ద్వారా రైతులను తెలియజేయనున్నారు.

ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు

చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్

ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా

జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?

70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..

వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?

9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..

రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..

టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు

ఆమె ఈమేనా.. ఏంటి ఇలా మారిపోయింది ఈ వయ్యారి.!

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.