వైద్యుల నిర్లక్ష్యం.. తల్లి ఒడిలోనే ప్రాణాలు వదిలిన చిన్నారి

రాష్ట్రం ఏదైనా.. ప్రభుత్వం ఏది ఉన్నా… పేదల బతుకులు మాత్రం మారడం లేదు. అందుకు ఈ ఘటన ఓ నిదర్శనం. చేతుల్లో చిల్లిగవ్వ లేకపోవడంతో.. ఓ తల్లి తన కుమారుడికి వైద్య సహాయం ఇప్పించలేకపోయింది. దీంతో ఆ కుమారుడు ప్రాణాలు వదిలాడు. యూపీలో జరిగిన ఈ దారుణ ఘటన.. వైద్యుల నిర్లక్ష్యాన్ని కూడా కొట్టొచ్చింది. షాజహాన్‌పూర్‌లో పదేళ్ల వయసున్న ఓ బాలుడికి తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం అతన్ని స్థానిక […]

వైద్యుల నిర్లక్ష్యం.. తల్లి ఒడిలోనే ప్రాణాలు వదిలిన చిన్నారి
Follow us

| Edited By:

Updated on: May 28, 2019 | 1:49 PM

రాష్ట్రం ఏదైనా.. ప్రభుత్వం ఏది ఉన్నా… పేదల బతుకులు మాత్రం మారడం లేదు. అందుకు ఈ ఘటన ఓ నిదర్శనం. చేతుల్లో చిల్లిగవ్వ లేకపోవడంతో.. ఓ తల్లి తన కుమారుడికి వైద్య సహాయం ఇప్పించలేకపోయింది. దీంతో ఆ కుమారుడు ప్రాణాలు వదిలాడు. యూపీలో జరిగిన ఈ దారుణ ఘటన.. వైద్యుల నిర్లక్ష్యాన్ని కూడా కొట్టొచ్చింది.

షాజహాన్‌పూర్‌లో పదేళ్ల వయసున్న ఓ బాలుడికి తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం లక్నోకు తీసుకెళ్లాలని సూచించారు. అయితే ఇందుకు అంబులెన్స్‌ సమకూర్చాలని వైద్యులను బాలుడి తల్లిదండ్రులు అడిగారు. ఆస్పత్రి ఆవరణలో మూడు అంబులెన్స్‌లు ఉన్నప్పటికీ.. వారికి అంబులెన్స్‌ను వైద్యులు సమకూర్చలేదు. డబ్బులు ఇస్తేనే అంబులెన్స్‌ను సమకూరుస్తామని స్పష్టం చేయడంతో.. ఆ తల్లి తన కుమారుడిని తన భుజాలపై మోసుకెళ్లింది. అయితే అప్పటికే తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అతడు… ఆస్పత్రి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే తల్లి ఒడిలోనే ప్రాణాలొదిలాడు.

ఇక ఆసుపత్రి వర్గాలు మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తున్నాయి. ఆ చిన్నారిని రాత్రి 8.10 గంటలకు ఆసుపత్రి తీసుకొచ్చారని.. అప్పటికే అతన్ని పరిస్థితి చాలా విషమంగా ఉందని అన్నారు. మేం వెంటనే లక్నోకు తీసుకెళ్లి చికిత్స అందించమని చెప్పామని.. అయితే వారు మా ఇష్టం వచ్చిన చోటికి తీసుకెళ్తామని చెప్పి ఆ పిల్లాడిని తీసుకువెళ్లారని.. ఇప్పుడు అనవసర ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన