Democrats : బైడెన్ వచ్చిరావడంతోనే చట్టసభల్లో ఆదిపత్యంపై ఫోకస్.. ముగ్గురు సెనేటర్ల ప్రమాణం..

నూతన అధ్యక్షుడు బైడెన్ వచ్చిరావడంతోనే చట్టసభల్లో ఆదిపత్యంపై ఫోకస్ పెట్టారు. సెనేట్‌లోకొత్తగా ఎన్నికైన ముగ్గురు డెమొక్రాటిక్‌ పార్టీ సెనేటర్లను కూడా ప్రమాణం చేయించారు. ఇందుదో జార్జియా నుంచి ఎన్నికైన..

Democrats : బైడెన్ వచ్చిరావడంతోనే చట్టసభల్లో ఆదిపత్యంపై ఫోకస్.. ముగ్గురు సెనేటర్ల ప్రమాణం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 23, 2021 | 7:07 AM

Democrats Senate control : నూతన అధ్యక్షుడు బైడెన్ వచ్చిరావడంతోనే చట్టసభల్లో ఆదిపత్యంపై ఫోకస్ పెట్టారు. సెనేట్‌లోకొత్తగా ఎన్నికైన ముగ్గురు డెమొక్రాటిక్‌ పార్టీ సెనేటర్లను కూడా ప్రమాణం చేయించారు. ఇందుదో జార్జియా నుంచి ఎన్నికైన పాత్రికేయుడు ఒస్సోఫ్, అట్లాంటాకు చెందిన పాస్టర్‌ వార్నాక్, కాలిఫోర్నియా నుంచి గెలుపొందిన అలెక్స్‌ పడిల్లాలతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ప్రమాణం చేయించారు. దీంతో ఇప్పటివరకూ రిపబ్లికన్లు ఆధిక్యత చాటుతూ వచ్చిన సెనేట్‌లో ఇప్పుడు డెమొక్రాట్లు పైచేయి సాధించినట్టయింది.

కొత్త అధ్యక్షుని ప్రమాణం రోజు… ఆయన యంత్రాంగానికి సంబంధించిన కొంతమంది నియామకాలకు సెనేట్‌ ఆమోదం తెలపడం ఆనవాయితీ. ఈ మేరకు బుధవారం సాయంత్రం కొత్త సభ్యుల ప్రమాణం అనంతరం సభ సమావేశమైంది. అధ్యక్షుని భద్రతా బాధ్యతలు చేపట్టే ‘నేషనల్‌ ఇంటెలిజెన్స్‌’ డైరెక్టరుగా బైడెన్‌ తన కాబినెట్‌కు నామినేట్‌ చేసిన అర్విల్‌ హైనెస్‌ నియామకానికి 84-10 ఓట్ల తేడాతో సెనేట్‌ ఆమోదం తెలిపింది.