దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ, మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్

దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకపడ్డారు. జమ్మూ కాశ్మీర్ లో గత ఏడాది నుంచి వందలాది రాజకీయ నాయకులను నిర్బంధంలో ఉంచారని..

దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ, మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 03, 2020 | 3:46 PM

దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకపడ్డారు. జమ్మూ కాశ్మీర్ లో గత ఏడాది నుంచి వందలాది రాజకీయ నాయకులను నిర్బంధంలో ఉంచారని ఆయన ఆరోపించారు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) నేత, మాజీ సీఎం కూడా అయిన మెహబూబా ముఫ్తీతో బాటు వీరిని విడుదల చేయాలని ఆయన కోరారు. సంవత్సర కాలంగా వీరంతా నిర్బంధంలోనే మగ్గుతున్నారని, ఇంకా ఎంతకాలం వీరిని ఇలా శిక్షిస్తారని ఆయన ప్రశ్నించారు. ముఫ్తీ సహచర నేత అయిన సజాద్ ఘనీ లోనే ని ప్రభుత్వం విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముఫ్తీ నిర్బంధ కాలాన్ని మళ్ళీ పొడిగించడాన్ని కాంగ్రెస్ మరో సీనియర్ నేత పి. చిదంబరం కూడా తీవ్రంగా ఖండించారు. 61 ఏళ్ళ మాజీ సీఎం, ప్రజాదరణ కలిగిన వ్యక్తిని నిరంతరం సాయుధ గార్డుల కాపలాలో ఉంచుతారా అని ఆయన  మండిపడ్డారు.

జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కలిగించేందుకు ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేసి,, ఈ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన అనంతరం కేంద్రం వీరినందరినీ నిర్బంధంలో ఉంచింది.