స్కూలుపై జారిపడిన విమాన ఇంధనం.. అమెరికాలో విచిత్రం.. పిల్లలకు స్వల్ప గాయాలు

అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌లో ఓ విచిత్రం జరిగింది. చైనాలోని షాంఘైకి బయల్దేరిన డెల్టా ఎయిర్ లైన్స్ విమానమొకటి ఎమర్జన్సీ ల్యాండింగ్ కోసం తిరిగి లాస్ ఏంజిలిస్ విమానాశ్రయానికి వస్తూ.. కిందకు ఇంధనాన్ని (ఫ్యూయల్) కుమ్మరించింది. భూమికి సుమారు 7,775 అడుగుల ఎత్తున ఆకాశంలో ఎగురుతున్న ఈ ప్లేన్.. ఇంజన్ లో లోపం కారణంగా అత్యవసరంగా దిగుతూ.. ఓ స్కూలుపై ఇంధనాన్ని జారవిడిచింది. స్కూలు ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటున్న పిల్లలు దీంతో శ్వాస సరిగా ఆడక ఇబ్బంది […]

స్కూలుపై జారిపడిన విమాన ఇంధనం.. అమెరికాలో విచిత్రం.. పిల్లలకు స్వల్ప గాయాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 15, 2020 | 1:42 PM

అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌లో ఓ విచిత్రం జరిగింది. చైనాలోని షాంఘైకి బయల్దేరిన డెల్టా ఎయిర్ లైన్స్ విమానమొకటి ఎమర్జన్సీ ల్యాండింగ్ కోసం తిరిగి లాస్ ఏంజిలిస్ విమానాశ్రయానికి వస్తూ.. కిందకు ఇంధనాన్ని (ఫ్యూయల్) కుమ్మరించింది. భూమికి సుమారు 7,775 అడుగుల ఎత్తున ఆకాశంలో ఎగురుతున్న ఈ ప్లేన్.. ఇంజన్ లో లోపం కారణంగా అత్యవసరంగా దిగుతూ.. ఓ స్కూలుపై ఇంధనాన్ని జారవిడిచింది. స్కూలు ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటున్న పిల్లలు దీంతో శ్వాస సరిగా ఆడక ఇబ్బంది పడ్డారు.సుమారు 20 మంది విద్యార్థులు, 11 మంది పెద్దలు స్వల్ప గాయాలకు గురయ్యారు. ఈ ఘటనలో ఇంధన ప్రభావం వల్ల కొందరికి కళ్ళు మండగా.. మరికొందరు ఇరిటేషన్ కి గురై బాధపడ్డారు. వీరినందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. అయితే హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో భయపడిపోయిన తమ పిల్లలను ఇళ్లకు తీసుకువచ్చేందుకు వారి తలిదండ్రులంతా అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులు, టీచర్లు ఒక్కసారిగా ఆ స్కూలు వదిలి ఇళ్ల బాట పట్టారు. దీంతో ఆ ప్రాంతంలో కొంత సేపు ఉద్రిక్త పరిస్థితివంటిది తలెత్తింది.