కరోనా వైరస్ కేసులతో తల్లడిల్లుతున్న ఢిల్లీ.. 70 వేల మార్క్ కు చేరిన నగరం

ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు తామరతంపరగా పెరిగిపోతున్నాయి, బుధవారం నాటికీ ఇవి 70 వేలకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 3,788 కేసులు నమోదు కాగా.. 64 మంది రోగులు మరణించారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2,365 కి చేరింది. మొత్తం 26,588 యాక్టివ్ కేసులు కాగా.. 41,437మంది రోగులు కోలుకున్నారు. ప్రతి కరోనా రోగి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరోనా సెంటర్ కి వెళ్లాలన్న విధానాన్ని రద్దు చేయాలని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని […]

కరోనా వైరస్ కేసులతో తల్లడిల్లుతున్న ఢిల్లీ.. 70 వేల మార్క్ కు చేరిన నగరం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 24, 2020 | 7:14 PM

ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు తామరతంపరగా పెరిగిపోతున్నాయి, బుధవారం నాటికీ ఇవి 70 వేలకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 3,788 కేసులు నమోదు కాగా.. 64 మంది రోగులు మరణించారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2,365 కి చేరింది. మొత్తం 26,588 యాక్టివ్ కేసులు కాగా.. 41,437మంది రోగులు కోలుకున్నారు. ప్రతి కరోనా రోగి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరోనా సెంటర్ కి వెళ్లాలన్న విధానాన్ని రద్దు చేయాలని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ డిప్యూటీ సీఎం మనీష్ శిశోడియా .. హోమ్ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఇదే అంశంపై తాను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కి కూడా నిన్న లేఖ రాశానన్నారు. అయితే ఆయన కార్యాలయం నుంచి ఇంకా సమాచారం అందలేదన్నారు. ఇది అమిత్ షా విధానానికి, అరవింద్ కేజ్రీవాల్ విధానానికి మధ్య పోరు కాదని ఆయన చెప్పారు. ప్రజలు సమస్యలు ఎదుర్కోని విధానాలు అవసరమన్నారు. ఇప్పటికే ఈ నగరంలో ప్రభుత్వం అనుసరిస్తున్న కొత్త పధ్దతుల కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.