తల్ల”ఢిల్లి” పోతున్న దేశరాజధాని.. ఎందుకంటే..?

దేశ రాజధాని ఢిల్లీ.. కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతోంది. మొన్నటి వరకు భారీ వర్షాలతో తల్లడిల్లిపోయిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు తాజాగా వాయుకాలుష్యంతో వణికిపోతోంది. ఇప్పుటికే ఇది ప్రమాద స్థాయికి చేరుకున్నట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ తెలుపుతోంది. ఇది శుక్రవారం 208 ఉండగా.. శనివారం 222 ఉంది. అయితే ఇది ఇవాళ 256కి చేరింది. ఇలానే కొనసాగితే వచ్చే వారం నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ […]

తల్లఢిల్లి పోతున్న దేశరాజధాని.. ఎందుకంటే..?
Follow us

| Edited By:

Updated on: Oct 13, 2019 | 6:12 PM

దేశ రాజధాని ఢిల్లీ.. కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతోంది. మొన్నటి వరకు భారీ వర్షాలతో తల్లడిల్లిపోయిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు తాజాగా వాయుకాలుష్యంతో వణికిపోతోంది. ఇప్పుటికే ఇది ప్రమాద స్థాయికి చేరుకున్నట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ తెలుపుతోంది. ఇది శుక్రవారం 208 ఉండగా.. శనివారం 222 ఉంది. అయితే ఇది ఇవాళ 256కి చేరింది. ఇలానే కొనసాగితే వచ్చే వారం నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది. కాగా, ఢిల్లీ నగర శివార్లలోని ఆనంద్‌ విహార్‌, వాజీపూర్‌ ప్రాంతాల్లో ఇప్పటికే ఏక్యూఐ 300కి చేరిందని పేర్కొంది. అయితే పంజాబ్‌, హరియాణాలో పంట వ్యర్థాలను కాల్చేయడంతోనే ఢిల్లీలో గాలి కలుషితం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, గత మూడు నెలల్లో ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని ప్రకటించడం ఇదే తొలిసారి. ఇటీవల కురిసిన వర్షాలతో ఇది కాస్త తగ్గింది. హరియాణా, పంజాబ్‌లో పంట వ్యర్థాలను కాల్చడం ప్రభుత్వం నిషేధించింది. కానీ, రైతులు మాత్రం పంటవ్యర్థాలను యథేచ్చగా కాల్చేస్తున్నారు. మరోవైపు వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు రాజధానిలో సరిబేసి సంఖ్య విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.