చలానా వేస్తే చస్తానంటూ.. పోలీసులకు యువతి బెదిరింపు..!

Delhi woman gets challan threatens to commit suicide, చలానా వేస్తే చస్తానంటూ.. పోలీసులకు యువతి బెదిరింపు..!

న్యూఢిల్లీలో ఓ యువతి నడిరోడ్డుపై హల్‌చల్ చేసింది. నాకు ఫైన్ వేస్తే చస్తానంటూ.. ట్రాఫిక్ పోలీసులనే బెదిరించింది. తన తలకు వున్న హెల్మెట్‌ను నేలకేసి విసిరికొట్టి మరీ.. రోడ్డుపై రచ్చరచ్చ చేసింది. ఈ మధ్యకాలంలో.. ట్రాఫిక్ పోలీసులు వేస్తున్న చలానాలకు.. అందరి గుండెలు గుభేలమంటున్నాయి. దీంతో.. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నా.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.. మరిన్ని చలానాలు విధిస్తున్నారు. కొంతమంది తలకొట్టుకుంటూ.. చలానాలు కట్టేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ఎందుకు కట్టాలంటూ.. ఎదురు తిరుగుతున్నారు.

అలాంటి ఉదంతమే.. ఢిల్లీలో చోటుచేసుకుంది. కశ్మీరీ గేట్ సమీపంలోని ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ యువతిని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. ఆగ్రహానికి గురైన.. ఆమె హల్‌చల్ చేసింది. అక్కడ జరుగుతున్న ఈ వివాదాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. దాదాపు అరగంట సేపు ఆ యువతి పోలీసులను విసిగింది.

Delhi woman gets challan threatens to commit suicide, చలానా వేస్తే చస్తానంటూ.. పోలీసులకు యువతి బెదిరింపు..!

ఈ విషయానికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ యవతి ఐఎస్బీటీ బస్టాండ్ వద్ద స్కూటీపై వెళ్తుండగా.. ట్రాఫిక్ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆమె స్కూటీకి ఉన్న నంబర్‌ ప్లేట్‌.. సగం విరిగి ఉంది. అందులోనూ.. ఒక నెంబర్ లేదు. అలాగే.. ఆ యువతి హెల్మెట్‌కి బెల్ట్ లేదు.. అందులోనూ సెల్‌ఫోన్ మాట్లాడుతూ స్కూటీ డ్రైవ్ చేస్తోంది. ఇది గమనించిన పోలీసులు ఆమెను ఆపుతుంటే.. ఆమె పారిపోవడానికి ట్రై చేసింది. కానీ.. మొత్తానికి ట్రాఫిక్ పోలీసులు ఆమెను పట్టుకున్నారు. దీంతో.. చలానా కట్టాలని పోలీసులు అడిగితే.. తన హెల్మెట్‌ను నేలకు విసిరిగొట్టి.. పెద్దగా హల్‌చల్ చేసింది. మీరు చలానా వేస్తే.. నేను ఉరివేసుకుని చస్తానంటూ.. తిరిగి వారినే బెదిరించింది. ఈ విషయాన్ని.. ఆ యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరించారు ట్రాఫిక్ పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *