ఢిల్లీ పోలీసు విభాగంలో సీమా థాకా అనే మహిళా కానిస్టేబుల్ పనితీరును ప్రశంసించని వాళ్ళు లేరు. కేవలం మూడు నెలల్లో 76 మంది మిస్సింగ్ బాలలను ట్రేస్ చేసి వారిని వారి తలిదండ్రుల..
ఢిల్లీ పోలీసు విభాగంలో సీమా థాకా అనే మహిళా కానిస్టేబుల్ పనితీరును ప్రశంసించని వాళ్ళు లేరు. కేవలం మూడు నెలల్లో 76 మంది మిస్సింగ్ బాలలను ట్రేస్ చేసి వారిని వారి తలిదండ్రుల వద్దకో, బంధువుల వద్దకో చేర్చేందుకు ఈమె చేసిన కృషి, విధి నిర్వహణ పట్ల చూపిన చిత్తశుద్డి అపారం. ఇలా ఈ శాఖలో ఈ పోలీసైనా కష్టపడితే వారికి ఇన్సెంటివ్ పథకం కింద’ఔటాఫ్ టర్న్ ప్రమోషన్’ ఇస్తారు. ఈ 76 మందిలో 56 మంది బాలలు 14 ఏళ్ళ లోపువారే ! ఢిల్లీ నుంచే కాకుండా దూర రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, పంజాబ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా గల్లంతయిన పిల్లలను కనుగొంది సీమా థాకా. జాడ తెలియకుండా పోయిన పిల్లలను కనుగొనడంలో ఈమెకు ఈమే సాటి అని ఢిల్లీ సీపీ శ్రీవాత్సవతో బాటు సినీ నటి రిచా చద్దా ప్రశంసలతో ముంచెత్తి ట్వీట్లు చేయడం విశేషం.