Delhi Violence: సీఏఏ అల్లర్లు: ఢిల్లీలోని నాలుగు ప్రదేశాల్లో కర్ఫ్యూ.. సరిహద్దులు సీజ్..!

సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలతో ఈశాన్య ఢిల్లీ అట్టుడుకుతోంది. సోమవారం మొదలైన ఈ అల్లర్లు ఈ రోజు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో మృతి చెందిన వారి సంఖ్య పదికి చేరగా.. దాదాపు 150మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులను పోలీసులు సీజ్ చేశారు. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించి.. నగరాన్ని అష్టదిగ్భంధనం చేశారు. ఈశాన్య ఢిల్లీ పరిధిలోని కర్నాల్ నగర్, జాఫరాబాద్, మౌజ్‌పూర్, చాంద్‌బాగ్‌ […]

Delhi Violence: సీఏఏ అల్లర్లు: ఢిల్లీలోని నాలుగు ప్రదేశాల్లో కర్ఫ్యూ.. సరిహద్దులు సీజ్..!
Follow us

| Edited By:

Updated on: Feb 25, 2020 | 8:03 PM

సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలతో ఈశాన్య ఢిల్లీ అట్టుడుకుతోంది. సోమవారం మొదలైన ఈ అల్లర్లు ఈ రోజు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో మృతి చెందిన వారి సంఖ్య పదికి చేరగా.. దాదాపు 150మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులను పోలీసులు సీజ్ చేశారు. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించి.. నగరాన్ని అష్టదిగ్భంధనం చేశారు. ఈశాన్య ఢిల్లీ పరిధిలోని కర్నాల్ నగర్, జాఫరాబాద్, మౌజ్‌పూర్, చాంద్‌బాగ్‌ కర్ఫ్యూ విధించారు. కర్వాల్, బాబర్‌పూర్‌లో 144 సెక్షన్ అమల్లో ఉంది.

మరోవైపు ఈ ఘర్షణలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు సంయమనంతో ఉండాలని.. శాంతి పునరుద్ధరణ కోసం అందరం కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అల్లర్లో గాయపడిని క్షతగాత్రులను డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి పరామర్శించిన కేజ్రీ.. ఆర్మీని రంగంలోకి దింపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అయితే సైన్యాన్ని రంగంలోకి దింపే ఆలోచన లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు.

కాగా ఈ అల్లర్ల నేపథ్యంలో వస్తోన్న వార్తలను నమ్మొద్దని పలువురు రాజకీయ ప్రముఖులు చెబుతున్నారు. పలుచోట్ల అబద్ధపు వార్తలను ప్రచారం చేస్తున్నారని.. ఈ అల్లర్లపై వచ్చే ఎలాంటి వార్తలను నమ్మెద్దండదని వారు చెబుతున్నారు. ఇక ఎలాంటి పుకార్లను సోషల్ మీడియాలోనూ వ్యాపించకండని పలువురు నేతలు సూచిస్తున్నారు. Read This Story Also: ఢిల్లీలో అదే ఉద్రిక్తత.. హింస.. ఏడుగురి మృతి