Breaking News
  • దేశవ్యాప్తంగా దీపయజ్ఞం. ప్రధాని మోదీ పిలుపు మేరకు దీపాలు వెలిగించిన దేశ ప్రజలు. దీపం వెలిగించిన రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు. దీపాల కాంతుల్లో దేదీప్యమానంగా వెలుగొందిన భారత్‌. తెలుగు రాష్ట్రాల్లో దీపాల కాంతులు. ప్రగతి భవన్‌లో దీపాలు వెలిగించిన సీఎం కేసీఆర్‌. తాడేపల్లిలోని తన నివాసంలో దీపాలు వెలిగించిన ఏపీ సీఎం జగన్‌. దీపాలు వెలిగించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌లు తమిళిసై, భిశ్వభూషణ్. తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. అత్యవసరసేవలు అందిస్తున్న వైద్యులు, పోలీసులు.. పారిశుద్ధ్య సిబ్బందికి దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపిన ప్రజలు.
  • 130 కోట్ల ప్రజల మహాశక్తిని చాటిన భారతీయులు. దీప యజ్ఞంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు. కుటుంబ సమేతంగా దీపం వెలిగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తన నివాసంలో దీపాలు వెలిగించిన ప్రధాని మోదీ. తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించిన కేంద్ర మంత్రులు, ఎంపీలు.
  • ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ ఫోన్‌. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 20 కోట్ల గన్నీ బ్యాగ్‌లు అవసరం. ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌. గన్నీ బ్యాగ్‌లకు తీవ్ర కొరత ఉందని వివరించిన సీఎం కేసీఆర్‌. పశ్చిమబెంగాల్‌లో గన్నీ బ్యాగ్‌ల పరిశ్రమలు తెరిపించాలన్న కేసీఆర్‌. పరిశ్రమలు తెరిపిస్తేనే గన్నీ బ్యాగ్‌ల సమస్య తీరుతుందన్న కేసీఆర్‌. పశ్చిమ బెంగాల్‌ నుంచి ప్రత్యేక రైళ్ల ద్వారా గన్నీ బ్యాగ్‌లు.. తీసుకొచ్చేందుకు అనుమతించాలని ప్రధాని మోదీకి కేసీఆర్‌ విజ్ఞప్తి. సంబంధిత శాఖలతో మాట్లాడతానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.
  • ఒక్క తప్పుడు మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేసినా కేసులు బుక్‌ చేస్తాం. వెరిఫై చేయకుండా సోషల్‌ మీడియాలో వీడియోలు షేర్‌ చేయొద్దు. డిజిటల్‌గా వెదికి పట్టుకుని అరెస్ట్‌ చేస్తాం. నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన వారిలో ఎవరూ కావాలని.. కరోనా వ్యాప్తి చేశారనడానికి ఆధారాలు లేవు. -టీవీ9 ఎన్‌కౌంటర్‌ విత్‌ మురళీకృష్ణలో అంజనీకుమార్‌, సజ్జనార్‌.
  • కర్నూలులో కరోనా విజృంభణ. ఒకేరోజు 12 పాజిటివ్‌ కేసులు నమోదు. 12 మంది ఢిల్లీ సభలకు వెళ్లివచ్చిన వారే. కర్నూలులో మొత్తం 53 కరోనా కేసులు నమోదు. కాంటాక్ట్‌ కేసులపై దృష్టిపెట్టిన అధికారులు.

Delhi Tour : నేడు ఢిల్లీకి సేనాని..రీజన్స్ ఇవే..

జనసేన అధినేత ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక వరుస ఢిల్లీ పర్యటనలతోనూ హల్‌చల్ చేస్తున్నారు.
Delhi Tour Pawan Kalyan along with Nadendla Manohar will visit to Delhi, Delhi Tour : నేడు ఢిల్లీకి సేనాని..రీజన్స్ ఇవే..

Delhi Tour :  జనసేన అధినేత ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక వరుస ఢిల్లీ పర్యటనలతోనూ హల్‌చల్ చేస్తున్నారు. గత నెలలో ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. అపై ఏపీలో బీజేపీతో జతకట్టి ముందుకు వెళ్తున్నారు. ఇక నేడు(గురువారం) మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు పవన్.  గతంలో ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే సందర్భంగా.. అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి పవన్ కోటి రూపాయల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.  తాజా ఢిల్లీ పర్యటనలో కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయానికి వెళ్లి..అందుకు సంబంధించిన చెక్‌ను సైనికాధికారులకు అందించనున్నారు.

ఇక మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన భవన్‌లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్ చీఫ్ గెస్ట్‌గా పాల్గొననున్నారు. పలువురు విద్యార్థుల సందేహాలకు  సమాధానాలు ఇవ్వనున్న జనసేనాని..కీలక ప్రసంగం కూడా చేయనున్నారు.  ఈ సందర్భంగా పవన్‌పై రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ఈ సదస్సులో ప్రదర్శించనున్నారు.   ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా మేఘాలయ అసెంబ్లీ స్పీకర్ మెత్బా లింగ్డో కూడా పాల్గొంటారు.

Related Tags