ఢిల్లీ అల్లర్లు : తాహిర్‌ హుస్సేన్‌.. “పీఎఫ్ఐ”పై ఈడీ కేసులు..

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీలో గత నెలలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లపై దర్యాప్తు వేగం పెంచారు ఢిల్లీ పోలీసులు. ఈ ఘర్షణలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్య దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు ఆప్ బహిష్కృత నేత తాహిర్ హుస్సేన్‌ ‌కారణమంటూ ఆరోపణల వచ్చిన నేపథ్యంలో ఆయనను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా తాహిర్‌ హుస్సేన్‌పై మరోకేసు నమోదైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ […]

ఢిల్లీ అల్లర్లు : తాహిర్‌ హుస్సేన్‌.. పీఎఫ్ఐపై ఈడీ కేసులు..
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2020 | 1:35 PM

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీలో గత నెలలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లపై దర్యాప్తు వేగం పెంచారు ఢిల్లీ పోలీసులు. ఈ ఘర్షణలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్య దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు ఆప్ బహిష్కృత నేత తాహిర్ హుస్సేన్‌ ‌కారణమంటూ ఆరోపణల వచ్చిన నేపథ్యంలో ఆయనను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా తాహిర్‌ హుస్సేన్‌పై మరోకేసు నమోదైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ తాహీర్ హుస్సేన్‌తో పాటు..పాపులర్‌ ఫ్రంట్‌ ఇఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ)పైనా కేసులు నమోదు చేశారు.

ఢిల్లీ అల్లర్లకు నిధులు సమకూర్చారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఈ చర్యలకు దిగింది. తాహీర్ హుస్సేన్‌పై మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో దాదాపు 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో 200 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. కోట్ల రూపాలయ ఆస్తినష్టం వాటిల్లింది. ఈ అల్లర్లను ఆప్ బహిష్కృత నేత తాహీర్ హుస్సేనే ప్రోత్సహించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు.. ఆయనకు సంబంధించిన షెడ్లలో పెట్రోల్ బాంబులు, మారణాయుధాలు కూడా దొరికినట్లు సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొట్టాయి.