దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏళ్లలో ఎన్నడూ లేనంత చలి.. ఆదివారం 6.9 డిగ్రీలకు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రత

దేశ రాజధాని ఢిల్లీలో బ్రతుకు దుర్భరంగా మారుతోంది. ఒక వైపు విపరీతమైన వాయు కాలుష్యంతో ప్రజలు సతమతమవుతుంటే, అటు, ఉష్ణోగ్రతలు కూడా అమాంతం పడిపోతున్నాయి. ఆదివారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 6.9 డిగ్రీలకు పడిపోయింది. 2003 నవంబర్‌ మాసంలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకాగా, తర్వాత ఇదే కావడం విశేషం. ఈ 17 ఏళ్లలో నేడు ఢిల్లీలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో శుక్రవారం 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత […]

  • Venkata Narayana
  • Publish Date - 5:55 pm, Sun, 22 November 20

దేశ రాజధాని ఢిల్లీలో బ్రతుకు దుర్భరంగా మారుతోంది. ఒక వైపు విపరీతమైన వాయు కాలుష్యంతో ప్రజలు సతమతమవుతుంటే, అటు, ఉష్ణోగ్రతలు కూడా అమాంతం పడిపోతున్నాయి. ఆదివారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 6.9 డిగ్రీలకు పడిపోయింది. 2003 నవంబర్‌ మాసంలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకాగా, తర్వాత ఇదే కావడం విశేషం. ఈ 17 ఏళ్లలో నేడు ఢిల్లీలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో శుక్రవారం 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇది గత 14 ఏళ్ల క్రితానికి సమానమని వాతావరణ శాఖ వెల్లడించింది.