మహిళలను వేధిస్తున్న సైకో ఎస్ఐ అరెస్ట్

మహిళలను వేధిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న సైకో పోలీసు అధికారి అరెస్టయ్యాడు.

మహిళలను వేధిస్తున్న సైకో ఎస్ఐ అరెస్ట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 26, 2020 | 6:38 PM

మహిళలను వేధిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న సైకో పోలీసు అధికారి అరెస్టయ్యాడు. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఒక వ్యక్తి పలువురు మహిళలను వేధించాడు. మహిళలు, బాలికలపై కారు లైట్లు వేయడం, వారి ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. పలుమార్లు హెచ్చరించిన ఖాకీ కౌర్యంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో భరించలేక కొందరు మహిళలు ఈ నెల 17 నుంచి 20 వరకు ద్వారకా ప్రాంత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఒక వ్యక్తి నెంబర్‌ ప్లేట్‌ లేని కారులో తిరుగుతూ మహిళలు, బాలికల పట్ల అభ్యంతరకరమైన హావభావాలు ప్రదర్శిస్తున్నట్లు ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పక్కానిఘా పెట్టిన స్థానిక పోలీసులు.. అతను వినియోగిస్తున్న కారును గుర్తించారు. ఆ కారు రిజిస్ట్రేషన్‌ ఆధారంగా నిందితుడ్ని ఎస్‌ఐ పునీత్ గరేవాల్‌గా గుర్తించారు. జనక్‌పురిలో నివాసం ఉంటున్న అతడ్ని శనివారం అరెస్ట్‌ చేశారు. పునీత్‌పై 354డీ,354 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆయన గతంలో ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ యూనిట్‌తోపాటు పలు విభాగాల్లో పని చేసినట్లు పోలీసులు తెలిపారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!