ఢిల్లీలో మళ్ళీ హింస.. ఘర్షణలు.. ఆందోళనకారుల రాళ్లదాడిలో పోలీసు మృతి

ఓవైపు అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబంతో సహా భారత పర్యటనలో ఉండగా.. మరోవైపు ఢిల్లీలో సోమవారం ఘర్షణలు చెలరేగాయి. జఫ్రాబాద్..మౌజ్ పూర్, గోకుల్ పురి వంటి ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో ఓ పోలీసు మరణించాడు. గోకుల్ పురిలో ఆందోళనకారులు

ఢిల్లీలో మళ్ళీ హింస.. ఘర్షణలు.. ఆందోళనకారుల రాళ్లదాడిలో పోలీసు మృతి
Follow us

| Edited By:

Updated on: Feb 24, 2020 | 4:58 PM

ఓవైపు అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబంతో సహా భారత పర్యటనలో ఉండగా.. మరోవైపు ఢిల్లీలో సోమవారం ఘర్షణలు చెలరేగాయి. జఫ్రాబాద్..మౌజ్ పూర్, గోకుల్ పురి వంటి ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో ఓ పోలీసు మరణించాడు. గోకుల్ పురిలో ఆందోళనకారులు జరిపిన రాళ్ళ దాడిలో గాయపడి మృతి చెందిన ఇతడిని రతన్ లాల్ అనే హెడ్ కానిస్టేబుల్ గా గుర్తించారు. మరికొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులకు, ఈ చట్టానికి అనుకూలంగా ప్రదర్శనలు చేస్తున్నవారికి మధ్య ఘర్షణలు రేగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులు పలు వాహనాలకు, షాపులు, ఇళ్లకు నిప్పు పెట్టారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి.. బాష్పవాయువు ప్రయోగించారు. జఫ్రాబాద్-మౌజ్ పూర్ రోడ్డులో ఒక యువకుడు పోలీసులపై నాటు తుపాకీతో 8 రౌండ్ల కాల్పులు జరిపాడు. అతి కష్టం మీద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలోనే నిన్న రాత్రి కూడా అల్లర్లు జరిగాయి. చాంద్ బాగ్ అనే ఏరియాలో  జరిగిన హింసాకాండలో.. ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. కొన్ని వాహనాలకు, ఇళ్లకు నిప్పు పెట్టారు.

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?