ఢిల్లీలో పసిపాప..వెయ్యి కి.మీ దూరంలో తల్లి…! విమానంలో పాలు

దేశరాజధాని ఢిల్లీలో ఓ నెలరోజుల పసికందు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కానీ, కన్నతల్లి మాత్రం బిడ్డకు పాలివ్వలేని స్థితిలో వెయ్యికిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో విమానంలో తల్లిపాలు తీసుకొచ్చి బిడ్డకు అందిస్తున్నారు.

ఢిల్లీలో పసిపాప..వెయ్యి కి.మీ దూరంలో తల్లి...! విమానంలో పాలు
Follow us

|

Updated on: Jul 21, 2020 | 1:11 PM

ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా.. కల్తీ వస్తువులే దర్శనమిస్తున్నాయి. పప్పులు, ఉప్పులతో సహా పాలు కూడా కల్తీ అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో పట్టణాలు, నగరాల్లో ఉంటున్న తమ పిల్లల కోసం గ్రామాల నుంచి తల్లిదండ్రులు ప్రతిరోజూ స్వచ్ఛమైన ఆవు, గేదె పాలను పంపిస్తుంటారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఓ తండ్రి తన బిడ్డకు పట్టించే పాలను స్వస్థలం నుంచి తెప్పిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం లేహ్‌నుంచి పాలు వస్తున్నాయి. వాటి కోసం అతడు ఢిల్లీ విమానాశ్రయంలో ఎదురుచూస్తుంటాడు. కాకపోతే, అవి తల్లిపాలు. అంటే అతడి భార్య తన బిడ్డ కోసం పంపిస్తున్న పాలు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోజుల పసికందు కోసం ఆ త‌ల్లిదండ్రులు ఇలా ప‌డ‌రాని క‌ష్టాలు ప‌డుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

నెల రోజులు కూడా నిండని ఓ ప‌సిపాప‌కు ఢిల్లీలో స‌ర్జరీ అవుతోంది. ఆ బిడ్డకు ఇమ్యూనిటీ కోసం తల్లి పాలు చాలా అవసరమని చెప్పారు వైద్యులు. కానీ, ఆ పాప తల్లి లడఖ్‌లోని లేహ్‌లో ఉంది. అసలే కరోనా వైరస్ విజ‌ృంభణ కొనసాగుతోంది.. పైగా ఆమెకు సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగింది. దీంతో 1000 కి.మీ. దూరంలోని ఢిల్లీకి ఆమె వచ్చే పరిస్థితి లేదు. దీంతో త‌ల్లి పాల‌ను ప్రతి రోజూ విమానంలో త‌ర‌లిస్తున్నారు. అయితే, రోడ్డు మార్గంలో తల్లిపాలను తరలించాలంటే, ఆలస్యం అవుతుంది. దాంతో పాలు పాడైపోయే అవకాశం ఉంది. అందుకే ఇలా విమానంలో పాలను తరలిస్తున్నారు.

అయితే, విమానంలో పాలు తరలింపు అంటే ఖర్చుతో కూడుకున్నది అనుకుంటారు. కానీ, ఇదంతా మానవత్వంతో జరుగుతున్న ప్రక్రియగా తెలుస్తోంది. పాప తండ్రి స్నేహితుడొక‌రు లేహ్ ఎయిర్ పోర్టులో ప‌ని చేస్తున్నాడు. అతడి సాయంతో పాప కుటుంబ స‌భ్యులు లేహ్ ఎయిర్ పోర్టులో అత‌నికి త‌ల్లి పాల‌ను తీసుకొచ్చి అందజేస్తారు. అక్క‌డ్నుంచి విమాన సిబ్బందితో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు పంపిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు పాలు వ‌చ్చే స‌మ‌యానికి పాప తండ్రి అక్క‌డికి వెళ్తాడు. విమానాశ్ర‌యం నుంచి పాల‌ను తీసుకొచ్చి ఆ బిడ్డ‌కు ఇస్తున్నాడు. ఇలా గ‌త కొద్ది రోజుల నుంచి జ‌రుగుతోంది. పాప‌కు శస్త్ర చికిత్స చేస్తున్న డాక్టర్లు.. చిన్నారి కోలుకుంటోందని, వ‌చ్చే వారం ప‌సిపాపను డిశ్చార్జి చేసే అవ‌కాశం ఉందని వైద్యులు వెల్లడించారు.

ఇకపోతే, చిన్నారికి వచ్చిన సమస్య ఏంటనే విషయానికి వస్తే…పుట్టుకతోనే ఆ శిశువుకు ఆహార నాళం, శ్వాస నాళం రెండూ కలిసిపోయాయి. దీంతో ప్రత్యేక సర్జరీ అవసరమని లేహ్‌ వైద్యులు చెప్పారు..దీంతో ఆ పాపను ఢిల్లీలోని మ్యాక్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అనేకమంది నెటిజన్లు స్పందిస్తూ…పాప త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Read More: మరణంలోనూ కవలలు కలిసే..తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న మృతి

2 బంతుల్లోనే ఖతం.. కట్‌చేస్తే.. టిక్కెట్ డబ్బులివ్వని పీసీబీ
2 బంతుల్లోనే ఖతం.. కట్‌చేస్తే.. టిక్కెట్ డబ్బులివ్వని పీసీబీ
టీడీపీలో ఆ సీట్లు మార్పున‌కు నిర్ణ‌యం.. బీ ఫారంలు అందజేత అప్పుడే
టీడీపీలో ఆ సీట్లు మార్పున‌కు నిర్ణ‌యం.. బీ ఫారంలు అందజేత అప్పుడే
ఆల్కహాల్‌ ఒక్కటే కాదు.. ఇవి కూడా లివర్‌ను పాడు చేస్తాయి
ఆల్కహాల్‌ ఒక్కటే కాదు.. ఇవి కూడా లివర్‌ను పాడు చేస్తాయి
స్కాట్లాండ్‌లో నీటిలో మునిగి ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి..
స్కాట్లాండ్‌లో నీటిలో మునిగి ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి..
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ కావాలా? ఈ బ్యాంకులు ట్రై చేయండి
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ కావాలా? ఈ బ్యాంకులు ట్రై చేయండి
మీరు సకాలంలో గృహ రుణం చెల్లించకపోతే మీ ఇంటిని ఎన్ని రోజులకు సీజ్‌
మీరు సకాలంలో గృహ రుణం చెల్లించకపోతే మీ ఇంటిని ఎన్ని రోజులకు సీజ్‌
ప్రియదర్శి, నభా నటేష్ మధ్య డార్లింగ్ పంచాయితీ. రీతూవర్మ రియాక్షన్
ప్రియదర్శి, నభా నటేష్ మధ్య డార్లింగ్ పంచాయితీ. రీతూవర్మ రియాక్షన్
వ్యాపారంలో ఇబ్బందులా.. ఈ రోజు సాయంత్రం ఈ చిన్న పరిష్కారం చేయండి
వ్యాపారంలో ఇబ్బందులా.. ఈ రోజు సాయంత్రం ఈ చిన్న పరిష్కారం చేయండి
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
ఇట్స్ అఫీషియల్.. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఇట్స్ అఫీషియల్.. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు