ఇక ఢిల్లీ మోట్రో, బస్సుల్లో మహిళలకు ఉచితం

Delhi Metro and bus rides likely to be free of cost for women, ఇక ఢిల్లీ మోట్రో, బస్సుల్లో మహిళలకు ఉచితం

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లకు తాయిలాలు సిద్ధం చేస్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. బస్సులు, మెట్రో రూళ్లలో మహిళలు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించాలని యోచిస్తున్నారు. మహిళలకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని.. కేజ్రీవాల్ టీం చెప్తోంది. ఇదే విషయంపై ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ ఉచిత ప్రయాణం సాధ్యాసాధ్యాలపై డీఎంఆర్సీ సీనియర్‌ అధికారులతో భేటీ అయి చర్చించారు. మరోవైపు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అంత సులువైన పని కాదని, సాంకేతికపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *