‘కబీర్‌ సింగ్‌’ స్ఫూర్తితో అమ్మాయిల‌ను బుట్ట‌లో వేసి..చివ‌ర‌కు..

ఎవ‌రండీ…సినిమాల ప్ర‌భావం జ‌నాల‌పై ఉండ‌ద‌ని చెప్పింది. మంచిని చూసి ప్ర‌భావితం అయ్యేవారు ఉండ‌క‌పోవ‌చ్చుగానీ, చెడును మాత్రం బాగా వంటబ‌ట్టించుకుంటారు. తాజాగా బాలీవుడ్ మూవీ కబీర్‌ సింగ్‌( తెలుగు ఫిల్మ్ అర్జున్‌ రెడ్డి రీమేక్‌) చూసి స్ఫూర్తి పొంది, తానో ఆర్థోపెడిక్ డాక్టర్‌నని క‌ల‌రింగ్ ఇచ్చిన‌ ఓ క్రిమిన‌ల్.. అమాయక యువతులను ట్రాప్ చేశాడు. అతడి చేతిలో మోసపోయిన ఓ లేడీ డాక్టర్‌ ఇచ్చిన కంప్లైంట్ తో స‌దరు చీట‌ర్ బాగోతం బ‌య‌ట‌ప‌డింది. ఈ సంఘటన న్యూఢిల్లీలో శుక్రవారం […]

‘కబీర్‌ సింగ్‌’ స్ఫూర్తితో అమ్మాయిల‌ను బుట్ట‌లో వేసి..చివ‌ర‌కు..
Follow us

|

Updated on: May 30, 2020 | 5:21 PM

ఎవ‌రండీ…సినిమాల ప్ర‌భావం జ‌నాల‌పై ఉండ‌ద‌ని చెప్పింది. మంచిని చూసి ప్ర‌భావితం అయ్యేవారు ఉండ‌క‌పోవ‌చ్చుగానీ, చెడును మాత్రం బాగా వంటబ‌ట్టించుకుంటారు.

తాజాగా బాలీవుడ్ మూవీ కబీర్‌ సింగ్‌( తెలుగు ఫిల్మ్ అర్జున్‌ రెడ్డి రీమేక్‌) చూసి స్ఫూర్తి పొంది, తానో ఆర్థోపెడిక్ డాక్టర్‌నని క‌ల‌రింగ్ ఇచ్చిన‌ ఓ క్రిమిన‌ల్.. అమాయక యువతులను ట్రాప్ చేశాడు. అతడి చేతిలో మోసపోయిన ఓ లేడీ డాక్టర్‌ ఇచ్చిన కంప్లైంట్ తో స‌దరు చీట‌ర్ బాగోతం బ‌య‌ట‌ప‌డింది. ఈ సంఘటన న్యూఢిల్లీలో శుక్రవారం జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. ఢిల్లీకి చెందిన ఆనంద్‌ కుమార్‌ అనే వ్యక్తి కబీర్‌ సింగ్ మూవీలోని ఆర్థోపెడిక్‌ సర్జన్..‌‌ షాహిద్‌ కపూర్‌‌ పాత్రతో ప్ర‌భావితం అయ్యాడు. తాను ఆర్థోపెడిక్‌ సర్జన్‌నని చెప్పుకుంటూ.. డా. రోహిత్‌ గుజరాల్‌ అనే ఫేక్ నేమ్ తో టిండర్‌ డేటింగ్‌ యాప్‌ ద్వారా అమ్మాయిల‌కు ఎర వేయసాగాడు. ఈ నేపథ్యంలో ఓ డాక్టర్‌ అతడి మాయ‌లో ప‌డింది.

ఇద్దరి మధ్యా స్లోగా మొద‌లైన చాటింగ్..త‌ర్వాత ప్రేమ వ‌ర‌కు వెళ్లింది. ఈ క్ర‌మంలో కుమార్‌ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. గుడ్డిగా నమ్మిన ఆ యువతి.. దాదాపు 30వేల రూపాయలు అతడి అంద‌జేసింది. ఇదే స‌మ‌యంలో ఆమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు అత‌డు సంపాదించాడు. కొద్దిరోజుల తర్వాత ఆ యువతికి ఆనంద్ ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానం వ‌చ్చి..లెఫ్ట్ అండ్ రైట్ క‌డిగిపారేసింది. అయితే ఆమెకు చెందిన ప్రైవసీ‌ చిత్రాలు, వీడియోలు బయటపెడతానంటూ బ్లాక్‌ మెయిల్‌ చేయసాగాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి, అతడిపై కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ఆనంద్‌తో పాటు అతడికి సహకరిస్తున్న మరో వ్య‌క్తిని అరెస్ట్‌ చేశారు.