ఢిల్లీ డాక్టర్ కు కరోనా పాజిటివ్.. ఆసుపత్రి మూసివేత

ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ లో గల ఓ క్యాన్సర్ ఆసుపత్రిలో పని చేసే ఒక డాక్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల బ్రిటన్ నుంచి తిరిగివఛ్చిన తన సోదరుడి  ద్వారా ఆయనకు  కరోనా సోకినట్టు తెలుస్తోంది.

ఢిల్లీ డాక్టర్ కు కరోనా పాజిటివ్.. ఆసుపత్రి మూసివేత
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 01, 2020 | 1:12 PM

ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ లో గల ఓ క్యాన్సర్ ఆసుపత్రిలో పని చేసే ఒక డాక్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల బ్రిటన్ నుంచి తిరిగివఛ్చిన తన సోదరుడి  ద్వారా ఆయనకు  కరోనా సోకినట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఆసుపత్రిని మూసివేశారు. ఓపీడీ, ల్యాబ్ తదితర విభాగాలను శానిటైజ్ చేసే పనిలో పడ్డారు అధికారులు. ఈ డాక్టర్ కు కరోనా అని తెలియగానే ఆసుపత్రి సిబ్బందిలో కలవరం మొదలైంది. ఆయనతో సన్నహితంగా పనిచేసే  పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈయన భార్య, కూతురుకి కూడా ఇన్ఫెక్షన్ సోకినట్టు చెబుతున్నారు. మరోవైపు..ఢిల్లీ నగరంలోని మారుమూల సందుల్లో (మొహల్లా) గల క్లినిక్ లలో పని చేస్తున్న ఇద్దరు డాక్టరర్లను  కూడా ఈ మహమ్మారి తగులుకుంది.  దీంతో ఈ వ్యాధికి గురైన క్లినికల్ డాక్టర్ల సంఖ్య మూడుకు పెరిగింది. అసలు అతి పెద్ద కేన్సర్ ఆసుపత్రి డాక్టర్ కే కరోనా సోకడం, ఆ ఆసుపత్రిని మూసి వేయడం స్థానికంగా సంచలనం కలిగిస్తోంది.