ఆధార్‌తో ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించండి : ఈసీకి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

ఎన్నికల్లో బోగస్ ఓట్ల ఏరివేత ఎన్నిసార్లు జరిపినా మళ్లీ మళ్లీ అదే సమస్య వస్తూనే ఉంది . దీనిపై బీజేపీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటరు గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. ప్రస్తుతం ఎన్నికల విధానంలో లోపాలున్నాయని, అందువల్ల ఆధార్‌తోనే ఎన్నికలు జరిపాలని ఆయన పిటిషన్‌లొ కోరారు. ఎన్నికల సమయంలో ఓటర్ల డేటాను భద్రపరచడం, వారికి తగిన […]

ఆధార్‌తో ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించండి :  ఈసీకి  ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2019 | 11:01 AM

ఎన్నికల్లో బోగస్ ఓట్ల ఏరివేత ఎన్నిసార్లు జరిపినా మళ్లీ మళ్లీ అదే సమస్య వస్తూనే ఉంది . దీనిపై బీజేపీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటరు గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. ప్రస్తుతం ఎన్నికల విధానంలో లోపాలున్నాయని, అందువల్ల ఆధార్‌తోనే ఎన్నికలు జరిపాలని ఆయన పిటిషన్‌లొ కోరారు.

ఎన్నికల సమయంలో ఓటర్ల డేటాను భద్రపరచడం, వారికి తగిన గుర్తింపు కార్డులు ఇవ్వడం వంటివి అధికారులకు పెద్ద సవాళ్లుగా మారాయని పిటినర్ పేర్కొన్నారు. ఈ ఓటింగ్ ప్రవేశపెట్టడం ద్వారా ఓటర్ల వేలిముద్రలు, ఫేస్ రికగ్నైజేషన్ వంటి వాటితో ఓటు వేయవచ్చని కూడా తన పిటిషన్‌లో తెలిపారు. ఈ విధానాన్ని పాటిస్తే నకిలీ, బోగస్ ఓట్లు లేకుండా చేయవచ్చని ఆయన సూచించారు. అదే సమయంలో ప్రతి ఎన్నికల సమయంలో ఆయా సమాచారాన్ని క్రమబద్దీకరిస్తే సరిపోతుందని పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ్ తెలిపారు. ఇదే విషయంపై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తే ఫలితం లేదనందునే కోర్టును ఆశ్రయించినట్టు ఆయన తెలిపారు.

ఆధార్ ఆధారంగా ఓటింగ్ నిర్వహించే విధానాన్ని పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సూచించింది. అలాగే దీని సాధ్యాసాధ్యాలపై 8 వారాల్లోగా వివరణ ఇవ్వాలని కూడా ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది కోర్టు.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!