నాలుగు వేల మంది తబ్లీఘీ జమాత్ సభ్యులకు స్వేఛ్చ

తప్పనిసరిగా క్వారంటైన్ కి వెళ్లి ఆ కాలపరిమితిని ముగించుకున్న సుమారు 4 వేల మంది తబ్లీఘీ జమాత్ సభ్యులను ఇళ్లకు వెళ్లాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. వీరిలో ఎవరికీ కరోనా పాజోటివ్ లక్షణాలు లేవని నిర్ధారించుకున్నాకే ఇళ్లకు పంపుతున్నట్టు పేర్కొంది. అయితే నిజాముద్దీన్ మర్కజ్ ఘటనతో సంబంధం ఉండి పోలీసుల దర్యాపు ఫైళ్లలో పేర్లు నలుగుతున్న వారిని మాత్రం పోలీసు కస్టడీకి ఇవ్వాలని సూచించినట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి జైన్ తెలిపారు. స్వేఛ్చ పొందిన ఈ […]

నాలుగు వేల మంది తబ్లీఘీ జమాత్ సభ్యులకు స్వేఛ్చ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 06, 2020 | 7:55 PM

తప్పనిసరిగా క్వారంటైన్ కి వెళ్లి ఆ కాలపరిమితిని ముగించుకున్న సుమారు 4 వేల మంది తబ్లీఘీ జమాత్ సభ్యులను ఇళ్లకు వెళ్లాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. వీరిలో ఎవరికీ కరోనా పాజోటివ్ లక్షణాలు లేవని నిర్ధారించుకున్నాకే ఇళ్లకు పంపుతున్నట్టు పేర్కొంది. అయితే నిజాముద్దీన్ మర్కజ్ ఘటనతో సంబంధం ఉండి పోలీసుల దర్యాపు ఫైళ్లలో పేర్లు నలుగుతున్న వారిని మాత్రం పోలీసు కస్టడీకి ఇవ్వాలని సూచించినట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి జైన్ తెలిపారు. స్వేఛ్చ పొందిన ఈ 4 వేల మందిలో 900 మంది ఢిల్లీకి చెందినవారు. ఇతరులు తెలంగాణ, తమిళనాడుకు చెందినవారని ఆయన చెప్పారు.