మద్యంపై ‘కరోనా ఫీజు’.. ‘మా పాలసీ కరెక్టే’.. హైకోర్టులో ఢిల్లీ ప్రభుత్వ వాదన

మద్యంపై కరోనా ఫీజు విధించాలన్న తమ విధానం సరైనదేనని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టులో  వాదించింది. స్పెషల్ కరోనా ఫీజు విధింపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించింది...

మద్యంపై 'కరోనా ఫీజు'.. 'మా పాలసీ కరెక్టే'.. హైకోర్టులో ఢిల్లీ ప్రభుత్వ వాదన
Follow us

| Edited By:

Updated on: May 28, 2020 | 5:44 PM

మద్యంపై కరోనా ఫీజు విధించాలన్న తమ విధానం సరైనదేనని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టులో  వాదించింది. స్పెషల్ కరోనా ఫీజు విధింపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించింది. మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు, మధ్య వినియోగం వంటివాటిని రెగ్యులేట్ చేసే అధికారం రాష్ట్రానికి ఉందని స్పష్టం చేసింది. నిజానికి అస్సాం, మేఘాలయ, కర్నాటక, ఏపీ, తెలంగాణ, యూపీ వంటి రాష్ట్రాలు కూడా లిక్కర్ పై ఫీజు విధించిన విషయాన్ని ఢిల్లీ సర్కార్ గుర్తు చేసింది. ప్రజలకు లిక్కర్ వ్యాపారంపై గానీ, ఇతరత్రా గానీ హక్కు లేదని, కానీ ప్రతిదానిని హేతుబధ్ధం చేసే పవర్స్ ప్రభుత్వానికి ఉందని అంటూ… ఇందుకు ఉదాహరణగా.. 2009 నాటి ఢిల్లీ ఎక్సైజ్ చట్టంలో చేసిన కొన్ని సవరణలను ప్రభుత్వం తరఫు  అడ్వొకేట్ ప్రస్తావించారు. ముఖ్యంగా ఈ కరోనా రోజుల్లో మద్యంపై ఫీజు విధింపు న్యాయ సమ్మతమే అని ఆయన పేర్కొన్నారు.

ఇలా ఉండగా.. .లిక్కర్ పై స్పెషల్ కరోనా ఫీజు విధించాలన్న ప్రభుత్వ  ఉత్తర్వులను కొట్టివేయాలని, ఇవి చట్టంలోని సెక్షన్ 26 ను ఉల్లంఘించేవిగా ఉన్నాయని కొందరు తమ పిటిషన్లలో ఆరోపించారు. పైగా ఫీజు కింద వసూలు చేసిన సొమ్మును రీఫండ్ చేయాలని ఆదేశించాల్సిందిగా కోరారు. అయితే కోర్టు వీటిని పరిష్కరించాల్సి ఉంది.

మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..