రైతు బిల్లులపై ఇక దేశ వ్యాప్త నిరసనల వెల్లువ

పార్లమెంట్ ఆమోదించిన రెండు వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్, డీఎంకే, ఆప్ వంటి వివిధ పార్టీలతో సహా భారతీయ కిసాన్ యూనియన్ నడుం కట్టాయి. ఈ బిల్లులపై ఇక రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేయడం ఒక్కటే మిగిలివుంది.

రైతు బిల్లులపై ఇక దేశ వ్యాప్త నిరసనల వెల్లువ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 22, 2020 | 12:08 PM

పార్లమెంట్ ఆమోదించిన రెండు వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్, డీఎంకే, ఆప్ వంటి వివిధ పార్టీలతో సహా భారతీయ కిసాన్ యూనియన్ నడుం కట్టాయి. ఈ బిల్లులపై ఇక రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేయడం ఒక్కటే మిగిలివుంది. గురువారం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రతాప్ సింగ్ బాజ్వా ఆధ్వర్యాన ఆందోళనలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం అన్ని ప్రతిపక్షాలతో కలిసి ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ భారీ ర్యాలీలు, సభలు, రాస్తారోకో ఆందోళనలు నిర్వహించనుంది. ఈ కమిటీకి కనీసం 10 ట్రేడ్ యూనియన్లు మద్దతు ప్రకటించాయి. ఇక రెండు కోట్ల మంది రైతుల సంతకాలతో నవంబరు 14 న (దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి నాడు) రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించాలని నిర్ణయించారు. అలాగే బాపూజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి రోజైన అక్టోబరు  2 న కూడా ప్రతి రాష్ట్రంలోని ర్యాలీలు, ఇతర ఆందోళనకార్యక్రమాలు నిర్వహిస్తారు. తమిళనాడులో ఈ నెల 28 నుంచి డీఎంకే ఆధ్వర్యాన రైతులు వివిధ నిరసన కార్యక్రమాలు చేపడతారు.  పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో  ఆప్. అకాలీదళ్  ఆధ్వర్యాన తైతు సంఘాలు ఉద్యమబాట పట్టనున్నాయి.  పశ్చిమ బెంగాల్ లో  లెఫ్ట్ ఫ్రంట్ నేతృత్వాన నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?
త్వరలో ఢిల్లీకి ఎయిర్‌ట్యాక్సీ.. 30 కి.మీ దూరానికి ఏడే నిమిషాలు
త్వరలో ఢిల్లీకి ఎయిర్‌ట్యాక్సీ.. 30 కి.మీ దూరానికి ఏడే నిమిషాలు