‘లగే రహో కేజ్రీవాల్ !’ ఆప్‌కి ‘గన్‌షాట్’గా మారిన పీకే స్లోగన్ !

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీకి ఇమేజ్ మేకోవర్ అయిన రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ‘నిశ్శబ్ద స్ట్రాటజీ’ ఎంతగానో ఉపయోగపడింది. ఆయన నేతృత్వంలోని ‘ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ’ (ఐ-పిఏసీ) తో సీఎం అరవింద్ కేజ్రీవాల్ గత డిసెంబరు 14 న డీల్ కుదుర్చుకున్నప్పుడే ఈ ఎన్నికల్లో ఆప్ విజయం ఖాయమని తేలిపోయింది. 2014  నుంచి ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ.. ప్రధాన పార్టీలకు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. నాటి ఎన్నికల్లో ప్రధాని మోదీ, అమిత్ […]

'లగే రహో కేజ్రీవాల్ !' ఆప్‌కి 'గన్‌షాట్'గా మారిన పీకే స్లోగన్ !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 11, 2020 | 2:19 PM

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీకి ఇమేజ్ మేకోవర్ అయిన రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ‘నిశ్శబ్ద స్ట్రాటజీ’ ఎంతగానో ఉపయోగపడింది. ఆయన నేతృత్వంలోని ‘ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ’ (ఐ-పిఏసీ) తో సీఎం అరవింద్ కేజ్రీవాల్ గత డిసెంబరు 14 న డీల్ కుదుర్చుకున్నప్పుడే ఈ ఎన్నికల్లో ఆప్ విజయం ఖాయమని తేలిపోయింది. 2014  నుంచి ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ.. ప్రధాన పార్టీలకు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. నాటి ఎన్నికల్లో ప్రధాని మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలోని బీజేపీకి, ఆ తరువాత 2015 లో బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యుకి, ఏపీలో అసెంబ్లీ, జనరల్ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, 2017 లో పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పీకే వ్యూహాలు దోహదపడ్డాయి. (అయితే ఇటీవల బీహార్ లో సీఏఏ, ఎన్నార్సీల విషయంలో నితీష్, పీకే మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో పీకేను జేడీ-యు నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే). ఇక తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీకి కూడా పీకే “దేవుడే’ అయ్యాడు. ఈ యంగ్, డైనమిక్ వ్యూహకర్తను  పంజాబ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉండాల్సిందని, అసలు నన్నడిగితే కొంతకాలం తరువాత రాహుల్ గాంధీ స్థానే ఈయన (ప్రశాంత్ కిషోర్) వచ్చినా  ఆశ్చర్యం లేదని కేజ్రీవాల్ ఈ మధ్య ఒక ఛానల్ కి ఇఛ్చిన ఇంటర్వ్యూలో ముసిముసి నవ్వులు నవ్వుతూ వ్యాఖ్యానించారు.

‘అచ్ఛే బీతే పాంచ్ సాల్.. లగేరహో కేజ్రీవాల్’ అనే స్లోగన్ పేరిట ప్రశాంత్ కిషోర్ పన్నిన రాజకీయ వ్యూహం ఫలించింది. ఢిల్లీ వీధుల్లో ఆప్ ప్రచార పోస్టర్లు, హోర్డింగులపై ఇప్పటివరకు నేతల ఫోటోల వెనుక తెల్లని రంగు ఉంటూ వచ్ఛేది. అయితే దీన్ని నల్లని రంగుగా మార్చాలని పీకే సూచించారట. అంటే ఎన్నికల ప్రచారంలో ‘కలర్ సైకాలజీ’ ని కూడా ఈయన సీరియస్ గా చూసేవారన్నమాట ! ‘లగే రహో కేజ్రీవాల్ ‘ అన్న నినాదాన్ని పసుపు  రంగులో ముద్రించాలని పీకే సూచించారంటే ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్ఛు.