సిక్త్ సెన్స్ తేడా కొట్టింది.. ఢిల్లీ తీర్పుపై మ‌నోజ్‌తివారీ రియాక్ష‌న్‌..!

ఢిల్లీలో క‌మ‌లం విక‌సిస్తుంద‌ని త‌న సిక్త్ సెన్స్ చెబుతుందంటూ పోలింగ్‌ రోజు కూడా ధీమా వ్యక్తం చేసిన బీజేపీ ఢిల్లీ అధ్య‌క్షుడు మ‌నోజ్ తివారీ చివ‌రకు ఓట‌మిని అంగీక‌రించారు. పార్టీ కేవ‌లం 7 సీట్ల‌కే ప‌రిమిత‌మైంద‌ని అంగీక‌రిస్తూ, మ‌రోసారి ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకున్న అర‌వింద్ కేజ్రీవాల్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఫ‌లితాలు నిరాశ‌ప‌రిచాయంటూనే.. పార్టీ కేడ‌ర్ స్థైర్యం కోల్పోవ‌ద్ద‌ని ఆయన ధైర్యం చెప్పారు. ఫలితాల అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీలో స‌రికొత్త ట్రెండ్ మొద‌లైంది. కాంగ్రెస్ పార్టీ […]

సిక్త్ సెన్స్ తేడా కొట్టింది.. ఢిల్లీ తీర్పుపై మ‌నోజ్‌తివారీ రియాక్ష‌న్‌..!
Follow us

| Edited By:

Updated on: Feb 11, 2020 | 5:19 PM

ఢిల్లీలో క‌మ‌లం విక‌సిస్తుంద‌ని త‌న సిక్త్ సెన్స్ చెబుతుందంటూ పోలింగ్‌ రోజు కూడా ధీమా వ్యక్తం చేసిన బీజేపీ ఢిల్లీ అధ్య‌క్షుడు మ‌నోజ్ తివారీ చివ‌రకు ఓట‌మిని అంగీక‌రించారు. పార్టీ కేవ‌లం 7 సీట్ల‌కే ప‌రిమిత‌మైంద‌ని అంగీక‌రిస్తూ, మ‌రోసారి ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకున్న అర‌వింద్ కేజ్రీవాల్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఫ‌లితాలు నిరాశ‌ప‌రిచాయంటూనే.. పార్టీ కేడ‌ర్ స్థైర్యం కోల్పోవ‌ద్ద‌ని ఆయన ధైర్యం చెప్పారు.

ఫలితాల అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీలో స‌రికొత్త ట్రెండ్ మొద‌లైంది. కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. రెండు ప్ర‌ధాన ప‌క్షాల మ‌ధ్యే ఇకపై రాజ‌కీయం ఉండ‌బోతోంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కంటే ఈ సారి బీజేపీ ఓట్ల‌శాతం మెరుగుప‌డింది’’ అని అన్నారు. ఇకపై ప‌ర‌స్ప‌ర నింద‌లు ప‌క్క‌న‌పెట్టి ఢిల్లీ అభివృద్ధిపై దృష్టిపెట్టాల‌ని ఈ సందర్భంగా మనోజ్ తివారీ సూచించారు. ‘స‌బ్‌కాసాథ్ స‌బ్‌కా వికాస్’ బీజేపీ నినాద‌మ‌న్న మ‌నోజ్‌ తివారీ…ఆరోప‌ణ‌లు, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు ఎన్నిక‌ల‌ వరకే ప‌రిమిత‌మంటూ చెప్పుకొచ్చారు.

ఢిల్లీలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న ప‌రిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని…ఇక్కడి ప్ర‌జ‌లు తమను గెలిపిస్తారని అంచనా వేసినట్లు ఈ బీజేపీ నేత‌ పేర్కొన్నారు. ఏదేమైనా ఢిల్లీలో 8 శాతం ఓట్లు పెర‌గ‌డం క‌మ‌లం పార్టీకి మంచి సంకేతామ‌ని తెలిపారు. ఇక సీఏఏకి వ్య‌తిరేకంగా షాహిన్‌భాగ్‌లో సాగుతున్న నిర‌స‌న‌లపై మాట్లాడిన మనోజ్ తివారీ.. ప్ర‌జ‌ల‌ను నెల‌ల‌ త‌ర‌బ‌డి ఇబ్బందుల‌కు గురిచేసేలా ర‌హ‌దారుల దిగ్బంధ‌నం స‌రికాద‌న్నారు. 11 త‌ర్వాత షాహిన్‌భాగ్ ఖాళీ అవుతుంద‌న్న త‌న వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇస్తూ…నిర‌స‌న‌కారుల్ని స‌ముదాయించి ఆందోళ‌న‌లు విర‌మింపజేయించాల్సిన బాధ్య‌త కేజ్రీవాల్‌పై ఉంద‌ని వెల్లడించారు. ఇదిలా ఉంటే మనోజ్ తివారీ సిక్స్ సెన్స్‌పై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. తివారీని టార్గెట్‌ చేస్తూ పలువురు నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు.

https://twitter.com/itsMrShrivastav/status/1227159428996059136

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?