నిర్భయ కేసు దోషి పవన్ గుప్తా లాయర్‌కు బార్ కౌన్సిల్ నోటీసు

నిర్భయ కేసు దోషి పవన్ కుమార్ గుప్తా తరఫు లాయర్ ఏపీ సింగ్‌కు ఢిల్లీ బార్ కౌన్సిల్ నోటీసు జారీ చేసింది. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను దాఖలు చేసినందుకు, విచారణకు హాజరు కానందుకు ఆయనపై చర్యలు తీసుకోవలసిందిగా ఢిల్లీ హైకోర్టు గతనెలలో ఆదేశించింది. తమ నోటీసుకు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని బార్ కౌన్సిల్ ఆయనను కోరింది. నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను మైనర్‌నని పవన్ గుప్తా చేసిన వాదనను హైకోర్టు గత ఏడాది డిసెంబరు 19 […]

నిర్భయ కేసు దోషి పవన్ గుప్తా లాయర్‌కు బార్ కౌన్సిల్ నోటీసు
Follow us

|

Updated on: Jan 19, 2020 | 12:04 PM

నిర్భయ కేసు దోషి పవన్ కుమార్ గుప్తా తరఫు లాయర్ ఏపీ సింగ్‌కు ఢిల్లీ బార్ కౌన్సిల్ నోటీసు జారీ చేసింది. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను దాఖలు చేసినందుకు, విచారణకు హాజరు కానందుకు ఆయనపై చర్యలు తీసుకోవలసిందిగా ఢిల్లీ హైకోర్టు గతనెలలో ఆదేశించింది. తమ నోటీసుకు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని బార్ కౌన్సిల్ ఆయనను కోరింది. నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను మైనర్‌నని పవన్ గుప్తా చేసిన వాదనను హైకోర్టు గత ఏడాది డిసెంబరు 19 న కొట్టివేసింది. అదేసమయంలో ఇతని తరఫు లాయర్ సింగ్ ఫోర్జరీ చేసిన పత్రాలను దాఖలు చేయడమే గాక.. విచారణకోసం కోర్టుకు కూడా హాజరు కాలేదు. దీంతో ఆయనకు కోర్టు 25 వేల రూపాయల జరిమానా విధించింది. ఈ అడ్వొకేట్ మీద తగిన చర్య తీసుకోవాలంటూ జస్టిస్ సురేష్ కుమార్ కైట్ లోగడ ఢిల్లీ బార్ కౌన్సిల్‌ను కోరారు. సింగ్ కావాలనే విచారణ ప్రక్రియను జాప్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. కాగా.. తన పిటిషన్‌ను ఢిల్లీకోర్టు కొట్టివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. పవన్ గుప్తా సుప్రీంకోర్టుకెక్కాడు.