డిగ్రీ కావాలంటే.. పరీక్షలు రాయాల్సిందే: యూజీసీ

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాల పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో యూజీసీ ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల ర‌ద్దుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. యూజీసీ త‌ర‌పున సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా

డిగ్రీ కావాలంటే.. పరీక్షలు రాయాల్సిందే: యూజీసీ
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2020 | 2:30 PM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో యూజీసీ ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల ర‌ద్దుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. యూజీసీ త‌ర‌పున సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా మాట్లాడుతూ.. డిగ్రీలు ప్ర‌దానం చేసే ప్ర‌క్రియ‌లో నియ‌మాల‌ను రూపొందించే హ‌క్కు కేవ‌లం యూజీసీకి మాత్ర‌మే ఉంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వాలు యూజీసీ నియ‌మావ‌ళిని మార్చ‌లేవ‌న్నారు. కోవిడ్19 నేప‌థ్యంలో విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండా డిగ్రీలు ఇవ్వ‌లేమ‌న్నారు. అయితే ఈ కేసును సుప్రీంకోర్టు ఆగ‌స్టు 14కు వాయిదా వేసింది.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో యూజీసీ ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని ఇటీవ‌ల మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ ప్ర‌భుత్వాలు నిర్ణ‌యించాయి. అయితే ఆ రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల స్పందించేందుకు యూజీసీకి సుప్రీం కొంత గ‌డువును ఇచ్చింది. సెప్టెంబ‌ర్ 30వ తేదీలోగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని గ‌తంలో యూజీసీ చెప్పింది. యూజీసీ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ఓవ‌ర్‌రైడ్ చేస్తుందా అని ఈ సంద‌ర్భంగా సుప్రీం ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. విద్యార్థులు చ‌దువుతూనే ఉండాల‌ని, కానీ వాళ్లు ప‌రీక్ష‌లు రాయ‌నంత వ‌ర‌కు వారికి డిగ్రీలు ఇవ్వ‌లేర‌ని మెహ‌తా తెలిపారు.

Read More:

గుడ్ న్యూస్: తెలంగాణ ఆస్పత్రుల్లో ఇక ఆర్‌టీ-పీసీఆర్‌ ద్వారా కరోనా టెస్ట్..!

తెలంగాణలో కొలువుల జాతర.. కార్మిక ఉపాధి కల్పన శాఖ కొత్త ప్లాన్‌..!