Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,248 కేసులు, 425 మంది మృతి. దేశవ్యాప్తంగా 6,97,413 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,53,287 యాక్టీవ్ కేసులు,4,24,433 మంది డిశ్చార్జ్. దేశంలో 60.77 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: నేడు సీఎం జగన్ ను కలవనున్న హై పవర్ కమిటీ . ఏల్జి పాలిమర్స్ ఘటనపై నివేదిక సమర్పించనున్న హై పవర్ కమిటీ. గ్యాస్ లీక్ తర్వాత అనేక అంశాల పై అధ్యయనం చేసిన హై పవర్ కమిటీ.
  • ఏపీలో మూడు రోజులు వర్షాలు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఆవర్తనం. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరాలకు సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం. అల్పపీడనంతో కోస్తా, రాయలసీమలపై నైరుతి రుతుపవనాల ప్రభావం. చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.
  • కాకినాడ: కరోన పరీక్షల్లో నిర్లక్ష్యం. కరోనా వైద్య పరీక్షలు విషయంలో బట్టబయలు అవుతున్న సిబ్బంది నిర్లక్ష్యం. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు నెగిటివ్ అంటూ సమాచారం ఇస్తున్న సిబ్బంది. కరోనా ల్యాబ్ నుండి వచ్చిన పాజిటివ్ రిపోర్టులను నెగెటివ్ గా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తున్న సిబ్బంది. రెండు రోజుల క్రితం కాకినాడ నగరంలో జగన్నాయక్ పూర్ లో ఒక యువకుడికి కరోనా పాజిటివ్. మీకు కరోనా పాజిటివ్ వచ్చిదంటూ ఆదే మధ్యాహ్నం సమాచారం ఇచ్చిన పోలీసులు. లేదు నెగిటివ్ వచ్చిందంటూ చెప్పిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది.
  • శ్రీకాకుళం జిల్లా : ఇచ్చాపురంలో 14 రోజులు లాక్ డౌన్ - జిల్లా కలెక్టర్ జె నివాస్. తాగునీరు, పాలు, నిత్యావసర సరుకులు, మందులు మినహా అన్ని దుకాణాలు మూసివేత. కాంటైన్మెంట్ జోన్ లో ఏ దుకాణానికి అనుమతి లేదు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే నిత్యావసర సరుకులకు అనుమతి. ఇచ్చాపురంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా నిర్ణయం. ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. మాస్కులు ధరించాలి. వ్యక్తుల మధ్య దూరం పాటించాలి. చేతులను తరచూ సబ్బుతో శుభ్రపరచుకోవాలి. 144వ సెక్షన్ అమలు. ఎక్కడా ప్రజలు గుమిగూడరాదు. ప్రజలు సహకరించాలి.
  • తెలంగాణ రాష్ట్రంలో భారీగా మరోసారి కోవిడ్ కేసులు నమోద. ఇవ్వాళ కొత్తగా 1590 కొరొనా పాజిటివ్ కేసులు. ఇవ్వాళ కొత్తగా ఏడు మరణాలు-295కి చేరిన మరణాల సంఖ్య. మొత్తం కేసుల సంఖ్య 23902. ప్రస్తుతం ఆక్టివ్ గా 10 904 ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడి. GHMC-1277, రంగారెడ్డి-82, మేడ్చెల్-125, సూర్యాపేట-23, నల్గొండ-14, మహబూబ్ నగర్-, సంగారెడ్డి19, కేసులు నమోదు. ఇవ్వాళ డిచార్జ్-1166 మొత్తం ఇప్పటి వరకు 12 703 మంది.

కరోనా ఎఫెక్ట్: వైద్యులకోసం డీఆర్‌డీవో వినూత్న బయోసూట్‌!

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్ని చిగురుటాకులా వణికిపోతున్నాయి. భారత్ లోనూ ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులు, ఇతర సిబ్బంది ఆ వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు
Bio Suit, కరోనా ఎఫెక్ట్: వైద్యులకోసం డీఆర్‌డీవో వినూత్న బయోసూట్‌!

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్ని చిగురుటాకులా వణికిపోతున్నాయి. భారత్ లోనూ ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులు, ఇతర సిబ్బంది ఆ వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు డీఆర్‌డీవో వినూత్న బయోసూట్‌ను రూపొందించింది. పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) సూట్‌ను వివిధ డీఆర్‌డీవో లేబొరేటరీలకు చెందిన శాస్త్రవేత్తలు.. టెక్స్‌టైల్, కోటింగ్, నానోటెక్నాలజీ తదితర సాంకేతికతలను పరిశీలించి వినూత్నమైన కోటింగ్‌ ద్వారా ఈ సూట్‌ తయారుచేశారు.

కాగా.. కుసుంఘర్‌ ఇండస్ట్రీస్‌ అనే సంస్థ ఈ సూట్‌ తయారీకి సంబంధించిన ముడి సరుకు సహా, కోటింగ్‌ మెటీరియల్‌ ఉత్పత్తి చేయడమే కాకుండా, పూర్తి సూట్‌ను కూడా తయారు చేస్తున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం రోజుకు 7 వేల సూట్లను తయారుచేసే సామర్థ్యం ఉన్నట్టు పేర్కొంది. వస్త్ర రంగంలో అనుభవం ఉన్న మరో సంస్థతో కలసి రోజుకు 15వేల సూట్లను తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించింది. సూట్‌ను అతికించే టేప్‌ల కొరత కారణంగా వీటి ఉత్పిత్తి తగ్గుతోందని తెలిపింది. దీనికి ప్రత్యామ్నాయంగా సబ్‌మెరైన్‌ల తయారీలో ఉపయోగించే ఓ పదార్ధాన్ని వినియోగిస్తున్నట్టు వెల్లడించింది.

Related Tags