భారత్ తో చైనా కయ్యం.. అమెరికా రక్షణ మంత్రితో రాజ్ నాథ్ సింగ్ చర్చలు !

ఇండో-చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ తో ఫోన్ లో చర్చలు జరపనున్నారు. గాల్వన్ లోయలో..

  • Umakanth Rao
  • Publish Date - 11:50 am, Tue, 30 June 20

ఇండో-చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ తో ఫోన్ లో చర్చలు జరపనున్నారు. గాల్వన్ లోయలో చైనీయుల చొరబాటు గురించి, ఇప్పటివరకు  ఉభయ దేశాల మధ్య మిలిటరీ స్థాయిలో జరిగిన చర్చల గురించి ఆయన వివరించనున్నారు.  లడాఖ్ లోని భారత భూభాగాల్లో చైనా తాజా  చొరబాటు ఈ చర్చల్లో ప్రధాన అంశంగా ఉండనుంది. అలాగే మంగళవారం మళ్ళీ కార్ప్స్ కమాండర్ స్థాయిలో రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చల పురోగతిని గురించి కూడా రాజ్ నాథ్ సింగ్ వివరించనున్నారు. గాల్వన్ వ్యాలీలో భారత భూభాగం వైపున సుమారు 423 మీటర్ల వరకు చైనా సేనలు ముందుకు వఛ్చినట్టు వార్తలు వచ్చాయి. కాగా.. గాల్వన్ నది పొంగి ప్రవహిస్తుండడంతో ఆ ప్రాంతంలో చైనా కల్వర్టులు కొన్ని కొట్టుకుపోయినట్టు కూడా తెలుస్తోంది.