‘మా మఠంలో మోదీ పొలిటికల్ స్పీచ్.. అత్యంత బాధాకరం’

కోల్ కతాలోని  రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయమైన బేలూరు మఠంలో ప్రధాని మోదీ చేసిన ‘రాజకీయ ప్రసంగం’  పట్ల మఠం సభ్యులు తీవ్ర ఆవేదనను, అసంతృప్తిని వ్యక్తం చేశారు. (ఆదివారం ఈ మఠంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. సవరించిన పౌరసత్వ చట్టంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించిన సంగతి తెలిసిందే.. ఈ చట్టం పౌరసత్వాన్ని ఇచ్చేందుకే తప్ప..లాక్కోవడానికి కాదు అని కూడా ఆయన అన్నారు). అయితే ఏ రాజకీయ పార్టీకీ నెలవు కాని, సంబంధం […]

'మా మఠంలో మోదీ పొలిటికల్ స్పీచ్.. అత్యంత బాధాకరం'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 13, 2020 | 5:26 PM

కోల్ కతాలోని  రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయమైన బేలూరు మఠంలో ప్రధాని మోదీ చేసిన ‘రాజకీయ ప్రసంగం’  పట్ల మఠం సభ్యులు తీవ్ర ఆవేదనను, అసంతృప్తిని వ్యక్తం చేశారు. (ఆదివారం ఈ మఠంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. సవరించిన పౌరసత్వ చట్టంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించిన సంగతి తెలిసిందే.. ఈ చట్టం పౌరసత్వాన్ని ఇచ్చేందుకే తప్ప..లాక్కోవడానికి కాదు అని కూడా ఆయన అన్నారు). అయితే ఏ రాజకీయ పార్టీకీ నెలవు కాని, సంబంధం లేని తమ మఠంలో ఆయన రాజకీయ ప్రసంగం చేయడంలో ఔచిత్యం లేదని,  తామెంతో మనస్తాపం చెందుతున్నామని ఈ మఠం సభ్యుడు గౌతమ్ రాయ్,  ప్రధాన కార్యదర్శి స్వామి సువిరానంద తెలిపారు. ‘ ఇది రాజకీయ వేదిక కాదు.. ఆ విధమైన ప్రకటనలు చేయడానికి ప్రధానికి ఇక్కడ అనుమతి లేదు ‘ అని పేర్కొన్న గౌతమ్ రాయ్.. గత కొన్నేళ్లుగా తమ కార్యాలయం పొలిటికల్ ప్లాట్ ఫామ్ గా మారిపోయిందని విమర్శించారు. గతంలో ఆర్ఎస్ఎస్ తో సంబంధమున్న సీనియర్ ఆధ్యాత్మిక నాయకులు ఈ సంస్థతో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. మోదీ విజిట్ ఈ ‘ గ్రోయింగ్ ట్రెండ్ ‘ లో భాగమే అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

‘ మేము మా ఇళ్లను, కుటుంబాలను వదిలి మోక్షం ఆశించి.. నిష్కల్మషమైన ఈ చోటికి వచ్చాం.. అనుచితమైన పిలుపులు, ప్రసంగాలను అనుమతించబోమని ‘ స్వామి సువిరానంద స్పష్టం చేశారు. ఇక్కడ హిందూ, ఇస్లామ్, క్రైస్తవ మతాలకు చెందిన సాధువులు ఉన్నారని, తామంతా ఒకే తలిదండ్రులకు జన్మించిన సోదరుల్లా ఉంటున్నామని ఆయన చెప్పారు. మోదీ ఈ దేశ ప్రధాని, మమతా బెనర్జీ ఈ రాష్ట్ర నేత.. అంతే అని ఆయన పేర్కొన్నారు.