దీపికా పదుకొణె బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా…

ఔట్‌డోర్స్‌కి వెళ్లినప్పుడు దీపికా తప్పనిసరిగా జలాల్ సాయాన్ని కోరుతుంది. అంతేకాదు జలాల్‌ని తన సొంత అన్నలా చూసుకుంటుంది. అంతేకాదురాఖీ పండుగ సమయంలో జలాల్‌కి రాఖీ కట్టి దీపికా తన ప్రేమని చాటి చెబుతుందట...

దీపికా పదుకొణె బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా...
Follow us

|

Updated on: Jun 11, 2020 | 5:39 PM

అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకొణెకు బాలీవుడ్‌‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఓం శాంతి ఓం అనే చిత్రంతో బాలీవుడ్‌లో కెరీర్‌‌ను ప్రారంభించిన దీపికా హాలీవుడ్‌లోను తన నటనతో మెప్పించింది. అశేష ఆదరణ పొందిన ఈ అమ్మడు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది.

ఏ ప్రాంతంకి వెళ్ళిన అభిమానుల తాకిడితో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే అన్ని సందర్భాలలోను దీపికాని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేది ఆమె బాడీగార్డ్‌ జలాల్‌. ఔట్‌డోర్స్‌కి వెళ్లినప్పుడు దీపికా తప్పనిసరిగా జలాల్ సాయాన్ని కోరుతుంది. అంతేకాదు జలాల్‌ని తన సొంత అన్నలా చూసుకుంటుంది. అంతేకాదురాఖీ పండుగ సమయంలో జలాల్‌కి రాఖీ కట్టి దీపికా తన ప్రేమని చాటి చెబుతుందట. అయితే దీపికాని వెంట ఉంటున్న బాడీగార్డ్ జలాల్‌ జీతం కూడా అదే స్థాయిలో ఉంది. ప్రతి నెల జీతం 6.5 లక్షల రూపాయలు అంటే ఏడాదికి 80 లక్షలు ఉండేదట. అంతే కాదు.. పండుగ రోజుల్లో జలాల్ కుటుంబానికి దీపిక ఇచ్చే బహుమతులు మరింత ప్రత్యేకంగా ఉంటాయట. దీపిక కుటుంబంలో జలాల్ ఓ సభ్యుడు అంటే నమ్మండి. రణ్‌వీర్ -దీపికాల పెళ్ళి సమయంలో జలాల్‌ సెక్యూరిటీ హెడ్‌గా విధులు నిర్వర్తించినట్టు టాక్. ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా తన బాడీగార్డ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడని అంటారు.