దీపికా వ‌ర్క‌వుట్స్‌.. షాక్ అవుతున్న నెటిజ‌న్స్!

Deepika Padukone Will Be 'Young Forever' Says Her Trainer. We Have To Agree, దీపికా వ‌ర్క‌వుట్స్‌.. షాక్ అవుతున్న నెటిజ‌న్స్!

నేటి తరం హీరోయిన్స్ వ‌ర్క‌వుట్స్ విష‌యంలో ఎంత శ్ర‌ద్ధ చూపిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రోజులో ఎక్కువభాగం జిమ్‌కే ప‌రిమిత‌మై శ‌రీరాన్ని చాలా ఫ్లెక్సిబుల్‌గా మార్చుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే (33) జిమ్ ట్రైన‌ర్ యాస్మిన్ క‌రాచీవాలా స‌మ‌క్షంలో చేస్తున్న కొన్ని వీడియోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో దీపికా చేస్తున్న వ‌ర్కవుట్స్ నెటిజ‌న్స్ నోరెళ్ళ‌పెట్టేలా చేస్తున్నాయి. దీపిక‌ వెన్నెముక కదలికను చూస్తుంటే, ఆమె ఎప్పటికీ యవ్వనంగా ఉంటుందని నేను చెప్ప‌గ‌ల‌ను… ఈ విష‌యాన్ని మేము అంగీక‌రించాము. మీరు కూడా అంగీక‌రిస్తార‌ని అనుకుంటున్నాను అని ఫిట్ నెస్ ట్రైన‌ర్ త‌న కామెంట్ ద్వారా తెలిపారు. ప్ర‌స్తుతం దీపికా ప‌దుకొణే మేఘ‌నా గుల్జార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చ‌పాక్ అనే సినిమాలో న‌టిస్తుంది. యాసిడ్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ పాత్ర‌లో దీపికా న‌టిస్తుంది.

View this post on Instagram

upside down,inside out!!!🤪

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *