5 కోట్ల ఫాలోవ‌ర్స్‌ తో.. మూడో స్థానంలో దీపిక‌..

ట్రెండ్ మారిందా? సినిమాల ప‌రంగా కాకుండా ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల విష‌యంలో సెల‌బ్రిటీల రేంజ్‌ని లెక్క‌లుగ‌డుతున్నారు. ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ప‌లు సోష‌ల్ మీడియా అకౌంట్స్‌లో యాక్టివ్‌గా

5 కోట్ల ఫాలోవ‌ర్స్‌ తో.. మూడో స్థానంలో దీపిక‌..
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2020 | 1:54 AM

Deepika Padukone: ట్రెండ్ మారిందా? సినిమాల ప‌రంగా కాకుండా ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల విష‌యంలో సెల‌బ్రిటీల రేంజ్‌ని లెక్క‌లుగ‌డుతున్నారు. ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ప‌లు సోష‌ల్ మీడియా అకౌంట్స్‌లో యాక్టివ్‌గా ఉంటున్న సెల‌బ్రిటీలు త‌మ ప‌ర్స‌న‌ల్‌, సినిమా, ఈవెంట్స్‌, బ్రాండింగ్ ప్ర‌మోష‌న్ అంశాల‌ని షేర్ చేస్తూ ఉన్నారు. దీంతో వారిని ఫాలో అయ్యేవారి సంఖ్య  క్ర‌మేపి పెరుగుతూ పోతుంది.

సోష‌ల్ మీడియాలో దక్షిణాది స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే చాలా యాక్టివ్. బాలీవుడ్ కాకుండా అటు హాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ని సైతం త‌న సినిమాల‌తో ఎంత‌గానో అల‌రించింది. త‌న పెళ్ళి స‌మ‌యంలో ఈ అమ్మ‌డు పెట్టిన పోస్ట్‌ల‌కి వేల కొల‌ది లైక్స్ వ‌చ్చాయి. స‌మాజంలో జ‌రిగే ప్ర‌తి విష‌యంపై త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా స్పందించే దీపికాకి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవ‌ర్స్ సంఖ్య‌  50 మిలియన్ల (5 కోట్లు)కి చేరింది.

ఈ క్రమంలో మూడో ఇండియన్‌గా దీపికానిలిచింది. ఇంతకు ముందు విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా ఈ ఘ‌న‌త సాధించారు. అయితే త‌న‌ని ఫాలో అవుతున్న వారంద‌రికి దీపికా ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌తలు తెలిపింది.

Also Read: బ్రెజిల్‌లో కరోనా బీభత్సం.. ఒక్కరోజే 45 వేలకు పైగా..