అరేబియా సముద్రంలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి నలుగురు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

సముద్రంలో పడవ బోల్తా పడటంతో నలుగురు మత్యకారులు గల్లంతయ్యారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు సమీపంలో జరిగింది. మంగళూరు సమీపంలోని అరేబియా సముద్రంలో  మత్స్యకారుల పడవ బోల్తా పడింది.

అరేబియా సముద్రంలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి నలుగురు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు
Follow us

|

Updated on: Dec 02, 2020 | 7:55 AM

సముద్రంలో పడవ బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందగా నలుగురు గల్లంతు అయ్యారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు సమీపంలో జరిగింది. మంగళూరు సమీపంలోని అరేబియా సముద్రంలో  మత్స్యకారుల పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో పడవలో 22 మంది మత్స్యకారులున్నారని మంగళూరు పోలీసులు తెలిపారు. కాగా వీరిలో 16 మందిని తోటి మత్యకారులు రక్షించారు. మిగిలినవారిలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు గల్లంతు అయ్యారు. గల్లంతు అయిన వారి  కోసం కోస్ట్ గార్డులు, మత్స్యకారులు సముద్రంలో గాలిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు అధికారులు. తుఫాన్ ప్రభావం వల్ల అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది, బలమైన గాలులువీస్తున్నాయి. దానికి తోడు భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల మత్స్యకారుల పడవ బోల్తా పడిందని అధికారులు చెప్పారు. తుఫాన్ నేపథ్యంలో డిసెంబరు 3,4 తేదీల్లో మత్స్యకారులు చేపలవేట కోసం అరేబియా సముద్రంలోకి వెళ్లారాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. గల్లంతైన మత్స్యకారులను కాపాడటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.