Breaking News
  • సామాజిక దూరాన్ని పాటించాలని ఎంత చెబుతున్నా షాపుల దగ్గర మాత్రం ఆ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. షాపుల దగ్గర సోషల్‌ డిస్టెన్సింగ్‌ కనిపించడం లేదు. ధరల పట్టికలను పెట్టడం లేదు. విజయవాడలాంటి పెద్ద పెద్ద నగరాలలో కూడా ఇదే పరిస్థితి. అసలే విజయవాడలో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అయినా అక్కడ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు జనం.. పక్కపక్కనే నిలబడి సరకులు కొనుక్కుంటున్నారు.
  • ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కాంటాక్టు కేసులు పెరగడంతో ఎవరెవరు ఢిల్లీకి వెళ్లి వచ్చారన్నది ఆరా తీస్తున్నారు అధికారులు. జిల్లాల వారిగా ప్రత్యేక బృందాలు ఆ పనిలోనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని గుర్తించారు. వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.
  • విజయవాడలోనే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో మరింత అప్రమత్తమయ్యారు కృష్ణా జిల్లా అధికారులు. సిటీలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఇక విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో బంద్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు.
  • ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎంత చితక బాదినా.. ఒళ్లు హూనం చేసినా.. వాళ్లు మాత్రం మారడం లేదు. మరికొందరికి ముప్పు కొని తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. బరి తెగించిన బద్మాష్‌గాళ్లు పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. ఏ పాపం ఎరుగని అమాయకులకి.. కరోనా మాయ రోగాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
  • కరోనా తోచనిపోయిన మృతదేహాలను మతంతో సంబంధం లేకుండా దహనం చేయాలి. ఖననం(పూడ్చి పెట్టడం) అనుమతించబడదు. అంత్యక్రియలకు 5 మందికి మించి ఉండకూడదు. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ పర్దేషి.

డెబిట్, క్రెడిట్ కార్డుల భద్రత కోసం.. ఆర్బీఐ షాకింగ్ రూల్స్!

Debit and credit cards that have never been used for online transactions should be disabled says RBI, డెబిట్, క్రెడిట్ కార్డుల భద్రత కోసం.. ఆర్బీఐ షాకింగ్ రూల్స్!

డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల భద్రత కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. డెబిట్, క్రెడిట్ కార్డుల ఇష్యూ, రీ-ఇష్యూ సమయంలో అన్ని డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఎటిఎం, పాయింట్ ఆఫ్ సేల్ (పోస్) టెర్మినల్స్ వద్ద దేశీయ లావాదేవీల కోసం మాత్రమే వర్తించేటట్టుగా ఉండాలని ఆర్బిఐ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది.

వినియోగదారులు తమ కార్డులను ఆన్‌లైన్ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం ఉపయోగించాలనుకుంటే, వారు ఈ సేవలకు విడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఏ వ్యక్తి అయినా ఆన్‌లైన్ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం తన కార్డులను ఉపయోగించకపోతే, ఈ సేవలకు వారి కార్డు నిలిపివేయబడుతుంది. తిరిగి ఈ సేవలను పొందటానికి వినియోగదారులు బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఉన్న కార్డ్ వినియోగదారుల కోసం దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలు, ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం కార్డును నిలిపివేయాలా వద్దా అనే విషయాన్ని బ్యాంకులు నిర్ధారించుకుంటాయి.

ఆన్‌లైన్, అంతర్జాతీయ, కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం ఎప్పుడూ ఉపయోగించని కార్డులు ఈ ప్రయోజనం కోసం తప్పనిసరిగా నిలిపివేయబడతాయి అని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. కార్డు యొక్క స్థితిలో ఏదైనా మార్పులు ఉంటే.. వాటి గురించి ఎస్సెమ్మెస్ లేదా ఇమెయిల్ హెచ్చరికల ద్వారా బ్యాంకులు వినియోగదారులకు తెలియజేయాలని ఆర్బీఐ సూచించింది.

Related Tags