డేంజర్ బెల్: అమ్మకానికి క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు… మీ అకౌంట్ జాగ్రత్త !!

మీ దగ్గర క్రెడిట్, డెబిట్ కార్డులున్నాయా..? అయితే జర భద్రం. మీ అకౌంట్‌కు చిల్లు పడ్డట్లే. త్వరలో మీ అకౌంట్‌లోని డబ్బులు మాయమైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు చదివేది నిజంగా నిజమండి. ఇప్పటికే భారత్‌లోని 13 లక్షల మంది ఖాతాదారుల డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను హ్యాక్ చేయడమే కాదు.. దానికి సంబంధించిన వివరాలను ఏకంగా అమ్మకానికి పెట్టేశారట హ్యాకర్లు. ఈ మొత్తం సమాచారాన్ని జోకర్స్ స్టాష్ అనే డార్క్ వెబ్‌సైట్లలో ఇండియా- మిక్స్-న్యూ-1(India- Mix-New-1) […]

డేంజర్ బెల్: అమ్మకానికి క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు... మీ అకౌంట్ జాగ్రత్త !!
Follow us

| Edited By:

Updated on: Nov 01, 2019 | 7:22 AM

మీ దగ్గర క్రెడిట్, డెబిట్ కార్డులున్నాయా..? అయితే జర భద్రం. మీ అకౌంట్‌కు చిల్లు పడ్డట్లే. త్వరలో మీ అకౌంట్‌లోని డబ్బులు మాయమైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు చదివేది నిజంగా నిజమండి. ఇప్పటికే భారత్‌లోని 13 లక్షల మంది ఖాతాదారుల డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను హ్యాక్ చేయడమే కాదు.. దానికి సంబంధించిన వివరాలను ఏకంగా అమ్మకానికి పెట్టేశారట హ్యాకర్లు. ఈ మొత్తం సమాచారాన్ని జోకర్స్ స్టాష్ అనే డార్క్ వెబ్‌సైట్లలో ఇండియా- మిక్స్-న్యూ-1(India- Mix-New-1) పేరు కింద  ఏకంగా రూ.6.74లక్షల కోట్లకు అమ్మేశారట. ఈ విషయాన్ని సింగపూర్‌కు చెందిన గ్రూప్-ఐబి భద్రతా పరిశోధన బృందం వెల్లడించింది. భారత్‌ ఎదుర్కొంటున్న అతిపెద్ద హ్యాక్‌ ఇదేనని ఇప్పుడు నిపుణులు చెబుతున్నారు.

ఇక ఇందులో మరో షాకింగ్ విషయం ఏంటంటే.. హ్యాక్ చేసిన కార్డుల్లో 18 శాతం ఒకే బ్యాంకుకు చెందిన కార్డులే ఉన్నాయట. అంతేకాదు ఆ డేటాలో భారతీయ బ్యాంకులకు సంబంధించిన వివరాలు 98శాతం ఉన్నాయని అలాగే కొలంబియన్ బ్యాంక్‌కు చెందిన వివరాలు 1శాతం ఉన్నాయని వెల్లడించారు. కార్డ్ నంబర్, సీవీవీ నంబర్, గడువు తేదీలు, ఖాతాదారుల పేర్లుతో కూడిన వివరాలన్నీ హ్యాకర్లు అమ్మినట్లు వారు తెలిపారు. స్కిమింగ్ టెక్నిక్‌ను(ఏటీఎం స్కిమ్మింగ్, ఆన్‌లైన్ స్కిమ్మింగ్) ఉపయోగించిన ఈ డేటాను వారు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటి నుంచైనా అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే ఈ హ్యాకింగ్‌పై భారతీయ బ్యాంకులు స్పందించి.. వారి వారి ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేయాలని ఆ సంస్థ వెల్లడించింది.