ఈఎంవీ చిప్ కార్డులతో జాగ్రత్త‌

రిజర్వు బ్యాంక్ ఆదేశాల మేరకు అన్ని బ్యాంకులు ఈఎంవీ చిప్ కలిగిన డెబిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఇంకా ఈఎంవీ చిప్ కార్డు లేనివారు బ్యాంకుకు వెళ్లి కొత్త కార్డు తీసుకోవచ్చు. మెరుగైన భద్రత కోసం ఆర్‌బీఐ ఈ నిబంధనను తీసుకువచ్చింది. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఈఎంవీ కార్డులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలను అప్‌గ్రేడ్ చేశాయి. ఇందులో కార్డు లావాదేవీ పూర్తి అయ్యేంత వరకు కార్డు లాక్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఏటీఎంలలో డబ్బులు […]

ఈఎంవీ చిప్ కార్డులతో జాగ్రత్త‌
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2019 | 3:14 PM

రిజర్వు బ్యాంక్ ఆదేశాల మేరకు అన్ని బ్యాంకులు ఈఎంవీ చిప్ కలిగిన డెబిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఇంకా ఈఎంవీ చిప్ కార్డు లేనివారు బ్యాంకుకు వెళ్లి కొత్త కార్డు తీసుకోవచ్చు. మెరుగైన భద్రత కోసం ఆర్‌బీఐ ఈ నిబంధనను తీసుకువచ్చింది.

ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఈఎంవీ కార్డులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలను అప్‌గ్రేడ్ చేశాయి. ఇందులో కార్డు లావాదేవీ పూర్తి అయ్యేంత వరకు కార్డు లాక్ అవుతుంది.

ఈ నేపథ్యంలో ఏటీఎంలలో డబ్బులు విత్‌డ్రా చేసుకునే సమయంలో కార్డులను జాగ్రత్తగా వాడాలని బ్యాంకులు కస్టమర్లను హెచ్చరిస్తున్నాయి. సరిగ్గా ఉపయోగించకపోతే కార్డు డ్యామేజ్ అయ్యే అవకాశముందని పేర్కొంటున్నాయి.

డబ్బులు డ్రా చేసే సమయంలో ఏటీఎం మెషీన్లలో డెబిట్ కార్డు లాక్ అవుతుందని, ఈ విషయం తెలియక చాలామంది కార్డును బలవంతంగా బయటకు తీస్తున్నారని బ్యాంకులు తెలిపాయి. ఇలా చేయడం వల్ల కార్డులోని చిప్ డ్యామేజ్ అయ్యే అవకాశముందని పేర్కొంది. ఇప్పటికే పలు కస్టమర్ల కార్డులు పనిచేయనట్లు ఫిర్యాదులు అందాయని బ్యాంకులు తెలిపాయి.