Breaking News
  • హైదరాబాద్‌: తార్నాకలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌ సదస్సు. పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై.
  • ప్రకాశం జిల్లా మార్టూరుకు బయల్దేరిన చంద్రబాబు. ప్రజాచైతన్య యాత్రను ప్రారంభించనున్న చంద్రబాబు.
  • కడప: రాయచోటి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పాల్గొన్న ఎంపీ మిథున్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎంపీ, ఎమ్మెల్యేలు.
  • వరంగల్‌లో వాటర్‌ మెన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ గోదావరి యాత్ర. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి రైతులతో సమావేశం. గోదావరి జలాల సద్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంసలు.
  • అమరావతి: చంద్రబాబు భద్రతను ఉద్దేశపూర్వకంగా తగ్గించారు. అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడడం తగదు-యనమల రామకృష్ణుడు. ఈ విషయంపై మండలిలో చర్చిస్తాం. అవసరమైతే ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తాం-యనమల రామకృష్ణుడు.
  • నిర్మల్‌: మంచిర్యాలలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని అడ్డుకున్న బీజేపీ నేతలు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, సర్దిచెప్పిన పోలీసులు. మంత్రితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ సోయం బాపూరావు.

‘సీఏఏపై వారితో కాదు.. నాతో చర్చకు రండి’.. అమిత్ షాకు ఒవైసీ సవాల్

Asaduddin Owaisi Questions Union Budget's

సీఏఏపై ప్రతిపక్షనేతలు తనతో చర్చకు రావాలని హోం మంత్రి అమిత్ షా చేసిన సవాలుకు ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. (మంగళవారం లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా.. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లేదా మాయావతి ఎవరైనా సరే.. తనతో బహిరంగంగా చర్చకు రావాలని సవాల్ విసిరారు). అయితే వారితో చర్చ ఎందుకు.. దమ్ముంటే నాతో చర్చకు రండి అని ఒవైసీ ప్రతిసవాల్ విసిరారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన ఆయన.. నేనిక్కడే ఉన్నాను..(తనను ఉద్దేశిస్తూ) ఒక గడ్డం వ్యక్తితో డిబేట్‌కు రండి.. సీఏఏ, ఎన్‌పీ‌ఆర్, ఎన్నార్సీ.. వీటిపై నేను చర్చకు రెడీ.. మీ ప్రశ్నలకు నేను సరైన సమాధానం చెబుతాను ‘ అన్నారు

‘హల్వా పదం ఎక్కడి నుంచి వచ్చింది ‘?

కేంద్ర బడ్జెట్ ప్రతులను పార్లమెంటుకు సమర్పించే ముందు ఆర్ధిక మంత్రిత్వ శాఖ ‘ హల్వా సెరిమనీ’‌ని నిర్వహించే సాంప్రదాయక పధ్దతిని ఒవైసీ ప్రశ్నించారు. హల్వా అన్నది అరబిక్ పదమని, హిందీ గానీ, ఉర్దూ పదం గానీ కాదని ఆయన అన్నారు. ఈ పేరును మారుస్తామని బీజేపీ నేతలు అంటున్నారని, అయితే అసలీ పదం ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకోవాలని ఒవైసీ పేర్కొన్నారు. ఇదే పదాన్ని వినియోగిస్తున్నారంటే మీరు అరబ్ దేశస్థులా అని ఆయన సూటిగా వ్యాఖ్యానించారు.

 

 

Related Tags