Breaking News
  • మహిళల కోసం వాట్సప్ నంబర్ ని అందుబాటులో కి తీసుకుని వచ్చిన జాతీయ మహిళ కమిషన్. లాక్ డౌన్ సమయంలో ఎవరైనా గృహ హింస కి ఎదుర్కుంటున్న మహిళల కోసం ఒక వాట్సప్ నెంబర్ ని లాంచ్ చేసిన జాతీయ మహిళ కమిషన్ వాట్సప్ నంబర్: 7217735372
  • మై హోం గ్రూప్ సంస్ధల విరాళం. కరోనా ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి సాయమందించిన మై హోం గ్రూప్. ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసి 3 కోట్ల రూపాయల చెక్ ని అందించిన మై హోం ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరక్టర్ జూపల్లి రామ్, శ్యామ్ రావు .
  • అమరావతి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధనలు మార్పు చేస్తూ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన గవర్నర్... వెంటనే ఆర్డినెన్స్ పై జీవో జారీ చేసిన ప్రభుత్వం
  • మధ్యప్రదేశ్ లో కరోనా తో మరో డాక్టర్ మృతి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 65 ఏళ్ల స్థానిక డాక్టర్ మృతి చెందినట్లు వెల్లడి. మధ్యప్రదేశ్ లో కరోనా తో మొత్తం 27 మంది మృతి. ఇండోర్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ప్రవీణ్ జాడియా.
  • భారత్‌లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ లేదని తేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. గతంలో ఇచ్చిన నివేదికలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఉందని పేర్కొన్న డబ్ల్యూహెచ్ఓ. అది పొరపాటుగా అంగీకరిస్తూ సవరణ చేసిన డబ్ల్యూహెచ్ఓ. దేశంలో కేవలం క్లస్టర్లుగా మాత్రమే కేసులున్నాయని వివరణ.

కావాలనే నా కుమారుడిని ఇరికించారు: ఉరిశిక్షపై దోషి రఫీ తండ్రి

చిత్తూరులో ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన కేసులో మహ్మద్ రఫీని దోషిగా తేలుస్తూ చిత్తూరు మొదటి అదనపు కోర్టు సోమవారం ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బాధిత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగిందని చిన్నారి తల్లి అన్నారు.
Death punishment to rapist and killer in Chittor, కావాలనే నా కుమారుడిని ఇరికించారు: ఉరిశిక్షపై దోషి రఫీ తండ్రి

చిత్తూరులో ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన కేసులో మహ్మద్ రఫీని దోషిగా తేలుస్తూ చిత్తూరు మొదటి అదనపు కోర్టు సోమవారం ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బాధిత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగిందని చిన్నారి తల్లి అన్నారు. మరోవైపు ఈ తీర్పుపై మహ్మద్ రఫీ తల్లిదండ్రులు స్పందించారు.

తమ కుమారుడు అమాయకుడని రఫీ తండ్రి పఠాన్‌వలీ పేర్కొన్నారు. పోలీసులు ఉరిశిక్ష వేయించామని చెప్పుకోవడానికే తమ కుమారుడిని బలి చేశారని ఆయన ఆరోపించారు. రఫీకి వ్యతిరేకంగా సాక్ష్యాలే లేవని చెప్పుకొచ్చారు. ఈ ఉరిశిక్షను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడానికి తనకు లాయర్‌ను పెట్టుకునే స్థోమత కూడా లేదని ఆయన అన్నారు. తమ కుమారుడిని చూసేందుకు జైలుకు వెళ్లాలని అనుకుంటే, తనను కూడా అరెస్ట్ చేస్తారని గ్రామస్తులు చెబుతున్నారని పఠాన్ వలీ పేర్కొన్నారు. అసలు నిందితులను పట్టుకోవడం చేతకాక.. రఫీని పట్టుకొని సమాజం ముందు దోషిగా చూపిస్తున్నారని.. డబ్బున్నోళ్లకు ఓ న్యాయం, లేనోళ్లకు మరో న్యాయమా..? అని ఆయన ప్రశ్నించారు.

Read This Story Also: చిత్తూరు చిన్నారి హత్యాచారం కేసు.. దోషికి ఉరిశిక్ష..!

Related Tags