కలెక్షన్స్ కురిపిస్తున్న కామ్రేడ్..

నో సింగిల్స్, నో డబుల్స్.. ఓన్లీ బౌండరీస్. టాలీవుడ్ అగ్గిపిడుగు విజయ్ దేవరకొండ ఫుల్ స్వింగ్‌లో వున్నాడు. డియర్ కామ్రేడ్‌కి వచ్చిన ఓపెనింగ్స్ విజయ్ కరిష్మా ఎంతన్నది ఇంకోసారి ఫ్రూవ్ చేస్తున్నాయి. కానీ ..కలెక్షన్ కంటే ఆడియన్స్ ఇస్తున్న అప్రిసియేషన్స్ తనకు బలమంటున్నాడు విజయ్ దేవరకొండ. యూత్ ఆడియన్స్ ఎంతగా ఎగబడ్డారంటే .. తొలిరోజు డియర్ కామ్రేడ్ ఓవరాల్ షేర్ 11 కోట్ల పైమాటే. ఏపీ, తెలంగాణల వరకు ఫస్ట్ డే కామ్రేడ్ కు వచ్చిన షేర్ […]

కలెక్షన్స్ కురిపిస్తున్న కామ్రేడ్..
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2019 | 9:38 PM

నో సింగిల్స్, నో డబుల్స్.. ఓన్లీ బౌండరీస్. టాలీవుడ్ అగ్గిపిడుగు విజయ్ దేవరకొండ ఫుల్ స్వింగ్‌లో వున్నాడు. డియర్ కామ్రేడ్‌కి వచ్చిన ఓపెనింగ్స్ విజయ్ కరిష్మా ఎంతన్నది ఇంకోసారి ఫ్రూవ్ చేస్తున్నాయి. కానీ ..కలెక్షన్ కంటే ఆడియన్స్ ఇస్తున్న అప్రిసియేషన్స్ తనకు బలమంటున్నాడు విజయ్ దేవరకొండ.

యూత్ ఆడియన్స్ ఎంతగా ఎగబడ్డారంటే .. తొలిరోజు డియర్ కామ్రేడ్ ఓవరాల్ షేర్ 11 కోట్ల పైమాటే. ఏపీ, తెలంగాణల వరకు ఫస్ట్ డే కామ్రేడ్ కు వచ్చిన షేర్ ఏడున్నర కోట్లు. తెలుగు ఇండస్ట్రీలో మిడిల్ రేంజ్ హీరోల్లో ఇదే అల్టిమేట్ ఫిగర్. కామ్రేడ్ చూపంచబోతున్న కొత్త కెమిస్ట్రీ ఏమిటన్న క్యూరియసిటీయే ఈ కాసుల పంటకు కారణం. హీరోయిన్ రష్మిక కూడా కామ్రేడ్ సక్సెస్ జర్నీకి మంచి సపోర్ట్ ఇచ్చింది.

అటు అబ్రాడ్‌లో కూడా ఈ మూవీ మంచి ప్రోగ్రెస్ సాధించింది. ప్రీమియర్ షోల నుంచి 3.1 లక్షల డాలర్లు దండుకుంది. డైరెక్టర్ భరత్ కమ్మ మంచి స్పిరిట్ ఉన్న కథను రాసుకుని టచ్చింగ్ ట్రీట్‌మెంట్‌తో తెరకెక్కించాడని సుకుమార్ లాంటి సీనియర్ డైరెక్టర్ల కాంప్లిమెంట్. సో.. విజయ్ దేవరకొండ డైరెక్టర్స్ హీరో్ అని మళ్లీ ఫ్రూవైనట్టే.