టీ20 ప్రపంచకప్ న్యూజిలాండ్‌లో జరగొచ్చు..!

ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ మధ్యలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విషయంలో ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ ట్విట్టర్ వేదికగా... 

టీ20 ప్రపంచకప్ న్యూజిలాండ్‌లో జరగొచ్చు..!
Follow us

|

Updated on: Jun 04, 2020 | 2:32 PM

కరోనా వైరస్ ప్రభావంతో మొత్తం క్రీడారంగం కుదేలయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అనేక పెద్ద టోర్నమెంట్లన్నీ కూడా వాయిదా పడ్డాయి. ఆఖరికి బీసీసీఐకు కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా నిరవధికంగా వాయిదా పడింది. ఇదంతా ఒక ఎత్తయితే.. ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ మధ్యలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విషయంలో ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘టీ20 ప్రపంచకప్ ను ఆస్ట్రేలియాలో నిర్వహించడం కంటే.. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న న్యూజిలాండ్‌లో జరపడం అందరికీ మంచిదని’ డీన్ జోన్స్ పేర్కొన్నారు.

న్యూజిలాండ్‌లో ప్రస్తుతం కరోనా పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చిందని చెప్పాలి. సరైన సమయంలో లాక్ డౌన్ ప్రకటించడంతో పాటు కరోనా టెస్టులు, హోం క్వారంటైన్ విషయాలలో ఆ దేశ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో న్యూజిలాండ్ కరోనాను జయించింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. ఆ విండోలో ఐపీఎల్ జరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మరి అసలు ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.!