Breaking News
  • హైదరాబాద్: జర్నలిస్టులందరికీ హెల్త్‌ కార్డులు అందించాలి, అన్ని ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈనెల 20 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు టీయూడబ్ల్యూజే వినతి పత్రాలు-టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ.
  • ఆసియాలోనే లైఫ్‌ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ మారింది. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌ సరఫరా చేస్తోంది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో హైదరాబాద్‌ వాటా 35శాతం-మంత్రి కేటీఆర్‌.
  • యాదాద్రి: గుండాల మండలం సుద్దాల దగ్గర ప్రమాదం, కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు.
  • విజయవాడ: ఎమ్మార్వో వనజాక్షిపై టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు, తమను కులం పేరుతో దూషించిందని ఫిర్యాదు చేసిన మహిళా రైతులు.
  • మహబూబాబాద్: పోడు భూముల ఆక్రమణదారులకు కలెక్టర్‌ హెచ్చరిక. 10 ఎకరాలకు మించి పోడు భూములు ఆక్రమించిన 119 మంది. ఆక్రమణదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు, కుల సంఘాల నేతలు. భూములు వెంటనే తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆదేశం. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.
  • ప్రాణం తీసిన సెల్ఫీ. కృష్ణాజిల్లా: నూజివీడులో విషాదం. సూరంపల్లి కాలువ దగ్గర సెల్ఫీ దిగేందుకు యువకుడు యత్నం. ప్రమాదవశాత్తు కాలువలో పడి యువకుడు మృతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పవన్‌.

బాక్సాఫీస్ షేక్ అయ్యే కాంబినేషన్..రాజమౌళి-మహేశ్ ఫిక్సయ్యారా?

Mahesh Babu confirms film with SS Rajamouli?, బాక్సాఫీస్ షేక్ అయ్యే కాంబినేషన్..రాజమౌళి-మహేశ్ ఫిక్సయ్యారా?

సౌత్ ఇండియాలో ప్లాపులేని టాప్ డైరక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే..అతడు కేవలం రాజమౌళి మాత్రమే. ఇక ‘బాహుబిలి’ తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాడు జక్కన్న. ప్రస్తుతం ఈ ఏస్ డైరక్టర్ రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం చేస్తున్నాడు. అయితే నిన్న రాజమౌళి46వ పుట్టిన రోజు వేడకను జరుపుకున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు స్టార్స్, సెలబ్రిటీస్  ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేశారు.

అందరి శుభాకాంక్షలు పక్కన పెడితే..  సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కి బర్త్ డే విషెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. “హ్యాపీ బర్త్ డే రాజమౌళి గారు. మీరు ఇలానే ఫిల్మ్ మేకర్స్‌కి స్పూర్తిని ఇవ్వాలని ఆశిస్తున్నాను ” అని ట్వీట్ చేశారు. ఇక మహేష్ ఇప్పటివరకు రాజమౌళితో ఒక్క సినిమా కూడా తీయలేదు. త్వరలో జక్కన్న మహేష్ తో సినిమా తీస్తున్నాడనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ అంతా వ్యాపిస్తుంది. అసలు ఎప్పటి నుండో రాజమౌళి– మహేష్ బాబుల కాంబినేషన్ లో సినిమా రావాల్సి ఉండే కానీ అది వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. అయితే  ‘ఆర్ఆర్‌ఆర్‌’ అయ్యాక మాత్రం మహేష్ బాబు తో రాజమౌళి సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది . ఇక ఆ సినిమాని బాహుబలిని నిర్మించిన ఆర్కా మీడియా నిర్మించనుందని టాక్.

మహేష్ బాబు – ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అంటే ఫ్యాన్స్ కు పూనకం రావడం ఖాయం. ఈ రేంజ్ కాంబినేషన్ కోసం టాలీవుడ్ ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది.  మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ కల నెరవేరుతోందన్న మాట . ఇకపోతే ఇది అఫిషియల్ ఇన్ఫర్మేషన్ కాదు. కానీ జక్కన్న బాహుబలి సిరీస్ తర్వాాత..చాలాకాలం సస్పెన్స్ మెయింటైన్ చేసి.. ఇండస్ట్రీలోనే టాప్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టీస్టారర్ మూవీ ఎనౌన్స్ చేసి అందరికి సర్ప్రైజ్ ఇచ్చాడు. వీరు ముగ్గురు కలిసి దిగిన ఫోటో బయటకు వచ్చే వరకు అసలు ఇలాంటి కాంబినేషన్ సెట్ అవుతుందని కూడా ఎవరూ ఊహించలేదు. మరి రాజమౌళి అలాంటి సర్ఫ్రైజ్ రెడీ చేసుకుని ఉన్నాడో, లేదో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.