ఐటీఆర్ గడువు.. ఆగస్టు 31 వరకు పెంపు..

Deadline to file income tax return for FY2018-19 extended to August 31, ఐటీఆర్ గడువు.. ఆగస్టు 31 వరకు పెంపు..

2018 -19 సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్నులు సమర్పించడానికి గడువు తేదీని ప్రభుత్వం ఆగస్టు 31 వరకు పొడిగించింది. సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి సమర్పించేందుకు జూలై 31 చివరి తేదీ. అయితే ఇప్పుడు ఆ గడువు మరో నెల రోజులకు పెంచింది. పలు కేటగిరీలకు చెందిన పన్ను చెల్లింపుదారులు ఆ తేదీలోగా రిటర్నులను సమర్పించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఐటీఆర్ సమర్పణ గడువు తేదీని పెంచాలని వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *