నాగ్ పొలంలో డెడ్‌బాడీ.. వీడిన మిస్టరీ

Dead Body Mystery Unfolds In Akkineni Nagarjuna Farm House, నాగ్ పొలంలో డెడ్‌బాడీ.. వీడిన మిస్టరీ

టాలీవుడ్ హీరో నాగార్జున పొలంలో మృతదేహాం దొరకడం స్థానికంగా పెద్ద సంచలనమైంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ పరిధిలో ఉన్న నాగార్జున పొలంలో దొరికిన ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. ఎముకల గూడులా ఉంది. కాగా తన పొలంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాగార్జున.. ఈ విషయంపై నిపుణులను అక్కడికి వెళ్లగా.. ఆ పొలంలోని ఓ ప్రాంతంలోని గదిలో కుళ్లిపోయిన మృతదేహాన్ని వారు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చివరికి డెడ్ బాడీ ఎవరిదో తేల్చేశారు.

ఆ మృతదేహం కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన పాండుదిగా పోలీసులు గుర్తించారు.. పాండు ధరించిన దుస్తులు ఆధారంగా అతని కుటుంబసభ్యులు దాన్ని ధృవీకరించారు. ఇది ఇలా ఉండగా పాండు మూడేళ్ళ క్రితం నుంచి కనిపించకుండా పోయాడని వారు చెప్పారు. అతని అన్న కుమార్ కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందటం.. ఆపై వ్యవసాయ భూమిని అమ్మాల్సి రావడంతో పాండు తీవ్ర మనోవేదనకు గురై నాగార్జునకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోని గదిలోకి వెళ్లి  తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఇకపోతే పోలీసులు మృతదేహం వద్ద లభ్యమైన పురుగుల మందు డబ్బాను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా పాండు తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న.. కుటుంబసభ్యులకు ఇలా శవంగా కనిపించేసరి తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *