నాగార్జున పొలంలో మృతదేహం కలకలం.. పూర్తిగా కుళ్లిపోయి..

Dead body in Nagarjuna Farmhouse, నాగార్జున పొలంలో మృతదేహం కలకలం.. పూర్తిగా కుళ్లిపోయి..

టాలీవుడ్ హీరో నాగార్జున పొలంలో మృతదేహాం దొరకడం స్థానికంగా కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ పరిధిలో ఉన్న నాగార్జున పొలంలో దొరికిన ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. ఎముకల గూడులా ఉంది. కాగా తన పొలంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాగార్జున.. ఈ విషయంపై నిపుణులను అక్కడకు పంపారు. అయితే పొలంలోకి వెళ్లిన తర్వాత ఓ ప్రాంతంలోని గదిలో కుళ్లిపోయిన ఈ మృతదేహాన్ని వారు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. అక్కడే పోస్టుమార్టమ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఆ శవం దొరికిన గదిని సీజ్ చేశారు.

మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై దర్యాప్తును ప్రారంభించారు. ఏడాది క్రితం అతడు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే అతడిది హత్యనా..? ఆత్మహత్యనా..? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. మరోవైపు ఈ విషయంపై ఇంకా నాగార్జున స్పందించలేదు. ఇదిలా ఉంటే గతేడాది జూలైలో ఇదే ఫాంహౌస్‌లో ఎలక్ట్రిక్ షాక్‌కు గురై దంపతులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *