‘ దిశ ‘ ఉదంతం.. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నిరవధిక దీక్ష

హైదరాబాద్ లో మహిళా డాక్టర్ దిశ ఉదంతం మంగళవారం కూడా దేశ రాజధాని ఢిల్లీని కుదిపివేసింది. ఇలాంటి హత్యాచార ఘటనలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని, మహిళలపై అత్యాచారాలు, దాడులను అరికట్టాలని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్… జంతర్ మంతర్ వద్ద నిరవధిక దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షలో ఆమె సన్నిహితులతో బాటు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు కూడా పాల్గొన్నారు. అయితే పోలీసులు మొదట.. సోమవారం సాయంత్రం తన దీక్షకు అనుమతించలేదని, టెంట్లు […]

' దిశ ' ఉదంతం.. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నిరవధిక దీక్ష
Follow us

|

Updated on: Dec 03, 2019 | 3:32 PM

హైదరాబాద్ లో మహిళా డాక్టర్ దిశ ఉదంతం మంగళవారం కూడా దేశ రాజధాని ఢిల్లీని కుదిపివేసింది. ఇలాంటి హత్యాచార ఘటనలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని, మహిళలపై అత్యాచారాలు, దాడులను అరికట్టాలని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్… జంతర్ మంతర్ వద్ద నిరవధిక దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షలో ఆమె సన్నిహితులతో బాటు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు కూడా పాల్గొన్నారు.

అయితే పోలీసులు మొదట.. సోమవారం సాయంత్రం తన దీక్షకు అనుమతించలేదని, టెంట్లు ఇతర సామాగ్రిని తొలగించారని ఆమె ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది ? మేం టెర్రరిస్టులమా అని ఆమె ప్రశ్నించారు. మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, వారి నిర్లక్ష్యం వల్ల దుండగులు పేట్రేగుతున్నారని స్వాతి మలివాల్ పేర్కొన్నారు. దేశంలో ఈ విధమైన నేరాల అదుపునకు మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టాలని కోరుతూ తాను గతంలో 10 రోజుల పాటు నిరాహార దీక్ష చేశానని గుర్తు చేసిన ఆమె..ఈ నేరాలకట్టడికి ప్రభుత్వం పార్లమెంటులో ‘ పోక్సో ‘ చట్టానికి సవరణలు చేసిందన్నారు.